నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమకు ఖ్యాతిని ఎల్లలు దాటెల చేసి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.ఇక వందల సినిమాల్లో నటించి ప్రతీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటుడిగా అత్యున్నత స్థానానికి చేరుకున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా రచయితగా నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలి గా తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటారు.చివరి వరకు కూడా సినిమాలే ఊపిరిగా బ్రతికారు నందమూరి తారకరామారావు.
అయితే ఇక ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయి లాంటి సినిమాలు ఎన్నో మైలు రాళ్ళ లాంటి సినిమాలు ఉన్నాయి.అలాంటి వాటిలో ఆరాధన సినిమా కూడా ఒకటి అనే విషయం తెలిసిందే.
ఇక ఆరాధన సినిమాను తన కెరియర్లోనే ఎంతో ప్రత్యేకం అంటూ అన్నగారు చెబుతూ ఉండే వాడట.అయితే అన్న గారు ఇలా అనడానికి కారణాలు కూడా లేకపోలేదు.
ఆరాధన సినిమాలో పాటలు అన్నింటినీ కూడా ఉత్తరాది గాయకుడు అయిన మహమ్మద్ రఫీ తో పాడించారు.నిజానికి ఆ పాటలను బాలసుబ్రమణ్యం పడాల్సి ఉన్నప్పటికీ.ఎన్టీఆర్ బాలసుబ్రమణ్యం మధ్య ఏర్పడిన చిన్నపాటి వివాదం కారణంగా ఇక ఎన్టీఆర్ బాలుని పక్కన పెట్టాడట.అదే సమయంలో ఇక హిందీ గాయకుడు తో పాటిస్తే కాస్త కొత్తదనం కూడా ఉంటుందని భావించారట సీనియర్ ఎన్టీఆర్.
ఈ క్రమంలోనే హిందీ గాయకుడిని రప్పించారట.
ఇక ఈ సినిమాలు హీరోయిన్ విషయంలో కూడా అన్నగారు పట్టుబట్టి మరీ ఒక హీరోయిన్ ను తన సినిమాలోకి తీసుకున్నారట.ముందుగా ఎన్టీఆర్ పక్కన జయప్రదను అనుకున్నారు దర్శక నిర్మాతలు.తర్వాత అతిలోక సుందరి శ్రీదేవి తీసుకోవాలని చర్చలు కూడా జరిగాయి.
కానీ ఎన్టీఆర్ మాత్రం దర్శక నిర్మాతలతో చర్చించి ఏరికోరి వాణిశ్రీ ని తన సినిమాలో ఉండేలా చేసుకున్నారట.అయితే ఒకానొక సమయంలో వాణిశ్రీ ముఖంలో కవళికలు ఎక్కడో చూసినా అన్నగారు ఇక ఈ సినిమాకు వాణిశ్రీ అయితేనే బాగా న్యాయం చేస్తుందని భావించి ఆమెను తీసుకున్నారట.
ఇక ఆ తరువాత అన్నగారి కెరీర్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది అని చెప్పాలి.