టాలీవుడ్ లో స్టార్ హోదా కుటుంబాలలో అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి.అల్లు రామలింగయ్య వంటి లెజెండరీ కమెడియన్ తో మొదలైన అల్లు కుటుంబ వారసత్వం ప్రస్తుతం అల్లు అర్జున్ ముందుకు తీసుకెళుతున్నాడు.
పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ తన పేరుని గుర్తింపుని పెంచుకుంటూ వెళ్తున్నాడు.ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ కూడా తన తమ్ముడు శిరీష్ హీరో కాలేకపోతున్నాడనేది వాస్తవం.
స్టార్ హీరో కాలేకపోయినా కనీసం టైర్ 2 హీరో కూడా కాలేదు అల్లు శిరీష్.
గౌరవం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శిరీష్ దాదాపు పదేళ్లకు పైగా ఒక్క హీట్ ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు.
అల్లు అర్జున్ ని స్టార్ హీరోగా నిలబెట్టడంలో తన తండ్రి అల్లు అరవింద్ కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు.కానీ తన విషయంలో మాత్రం తన తండ్రి గాని అన్న గాని పట్టించుకోవడం లేదనే కోపం శిరీష్ లో ఎక్కువగా ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
అల్లు అరవింద్ సైతం ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వ్యవహరించడంలో దిట్ట.స్క్రిప్ట్ దగ్గర నుంచి బడ్జెట్ వరకు ప్రతి విషయం కూడా ఆయనకు పర్ఫెక్ట్ గా ఉండాలి.
మరి అలాంటి అల్లు అరవింద్ కొడుకుని ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఎదురవుతున్న ప్రశ్న.

ఇక ఇదే విషయంపై అల్లు శిరీష్ తన తండ్రి, అన్నతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం ముంబైలో ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగానే ఉంటున్నాడట శిరీష్.ఇక ఇప్పటికే అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా ప్రేమ కాదంటా అని ఒక సినిమాని అనౌన్స్ చేసినప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు.
మరోవైపు అను మరియు శిరీష్ లు ప్రేమలో మునిగితేలుతున్నారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.మరి అల్లు శిరీష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు అనే విషయంలో ఇప్పటికీ నిజమేంటో అబద్ధం ఏంటో తెలియదు కానీ వార్తల జోరు మాత్రం పెరిగింది అని చెప్పాలి.