జింబాబ్వేతో వన్డే సిరీస్ లో టీమిండియా విజయం సాధించింది.హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో గెలిచింది.ముందుగా జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసింది.అనంతరం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 30.5 ఓవర్లలోనే భారత్ తనన మ్యాచ్ ను ముగించింది.
ఓపెనర్లు శిఖర్ ధావన్ 81, శుభ్ మాన్ గిల్ 82 పరుగులతో అజేయంగా నిలిచారు.113 బంతులెదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు కొట్టగా, యువ ఆటగాడు గిల్ 72 బంతులాడి 10 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు.ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది.ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 20న ఇదే మైదానంలో జరగనుంది.