ఈ రోజుల్లో అమ్మాయిలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేయటం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.అంతేకాక శ్రద్ధ కూడా అసలు పెట్టటం లేదు.
అయితే ఈ విధంగా చేయటం చాలా తప్పు.ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేయటం వలన అనేక రకాల సమస్యలు వస్తాయి.
ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్థూలకాయం
ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ మానేయటం వలన ఆకలి విపరీతంగా పెరిగి మధ్యాహ్న సమయంలో భోజనం ఎక్కువగా తీసుకుంటాం.
ఈ విధంగా ఎక్కువగా తినటం వలన కేలరీలు పెరిగిపోయి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అది క్రమంగా మధుమేహం,గుండె జబ్బులకు దారితీస్తుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే జీవక్రియలు సక్రమంగా జరిగి శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.
నెలసరి సమస్యలు
అమ్మాయిలు తరచుగా బ్రేక్ ఫాస్ట్ తినటం మానేస్తే నెలసరి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అందువల్ల అమ్మాయిలు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ మీద శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది.
మానసిక ఆరోగ్యం
ఉదయం మూడీగా లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రోజంతా చురుగ్గా ఉండవచ్చు.రోజంతా చురుగ్గా,ఉల్లాసంగా ఉండాలంటే పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి.