చుండ్రు( Dandruff ) అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.ఆడవారే కాదు మగవారు, చిన్నపిల్లలు కూడా చుండ్రు సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు.
చుండ్రు అనేది వివిధ కారణాలవల్ల తలెత్తే సమస్య.అయితే ఈ సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలి అనుకుంటే అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.
మరి ఆ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఎండిన వేపాకు( Dried Neemleaves ) వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) పోసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపాకు, వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలి.
వీటితో పాటు అంగుళం ఎండిన అల్లం ముక్కను మెత్తగా దంచి ఆయిల్ లో వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకోవాలి.

చుండ్రు చికిత్సకు ఈ ఆయిల్ ఎంతో బాగా సహాయపడుతుంది.వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ ఆయిల్ ను వాడడం అలవాటు చేసుకుంటే చుండ్రు అన్న మాటే అనరు.
ఈ ఆయిల్ చుండ్రును సంపూర్ణంగా నివారిస్తుంది.స్కాల్ప్ ను హెల్తీగా హైడ్రేట్ గా మారుస్తుంది.
అంతేకాకుండా ఈ ఆయిల్ ను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.దృఢంగా దట్టంగా పెరగడం స్టార్ట్ అవుతుంది.