టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోలలో నాని ఒకరు నాని ఒకవైపు హీరోగా బిజీగా ఉన్నా మరోవైపు నిర్మాతగా కూడా కెరీర్ ను కొనసాగిస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే.నాని నిర్మాతగా 12 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించిన కోర్ట్ మూవీకి సంబంధించి రిలీజ్ కు రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కావడం గమనార్హం.
కథ :

2013 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా విశాఖలో ఉండే మంగపతి(శివాజీ) పొలిటికల్ పలుకుబడితో కెరీర్ ను కొనసాగిస్తూ ఉంటారు.తన బంధువుల ఇంట్లో కూడా మంగపతి తన పెత్తనమే సాగాలని అనుకుంటారు.మంగపతికి వరుసకు కోడలు అయిన జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది.వాచ్ మెన్ కొడుకు చందుతో జాబిలి ప్రేమలో పడిందని తెలిసి అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయిస్తాడు.
చందూ ఈ కేసులో చిక్కుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) చందూను ఈ కేసు నుంచి ఎలా బయటపడేలా చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :

రాజ్యాంగం చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెబుతుండగా పోక్సో చట్టం ఏ విధంగా మిస్ యూజ్ అవుతుందో ఈ సినిమాలో చూపించారు.అసభ్యతకు ఏ మాత్రం తావివ్వకుండా ఈ సినిమాను తెరకెక్కించారు.కోర్ట్ సినిమా కథ, కథనంలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి.
ప్రధాన పాత్రల్లో నటించిన రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, సాయికుమార్, శివాజీ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.శివాజీ తన కెరీర్ లో నిలిచిపోయే పాత్రలో ఈ సినిమాలో నటించారు.
చిన్నచిన్న ట్విస్టులు, ఎమోషనల్ సీన్లు ఆకట్టుకున్నాయి.
బలాలు : మ్యూజిక్, ప్రధాన పాత్రధారుల నటన, కథ, నిర్మాణ విలువలు

బలహీనతలు : కొన్ని బోరింగ్ సీన్స్, లాజిక్ కు అందని కొన్ని సన్నివేశాలు
రేటింగ్ : 2.75/5.0