గండాలు కడతేర్చే వీరభద్ర అని భక్తజనం ప్రాణమిల్లే సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు.కొర మీసాల స్వామికి వెండి బంగారు మీసాలు సమర్పించి మొక్కలు తీర్చుకునే తరుణం వచ్చేసింది.
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతిని పురస్కరించుకొని 8 రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.ఇందుకోసం ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లను పూర్తి చేసింది.
మంగళవారం సాయంత్రం భద్రకాళి వీరభద్ర స్వామి కళ్యాణం తో వేడుకలు మొదలవుతున్నాయి.
భక్తుల కొంగుబంగారం కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి మొదలయ్యాయి.
మకర సంక్రాంతిని పురస్కరించుకొని 10వ తేదీన స్వామి వారి కళ్యాణం తో ఈ జాతర ప్రారంభమై ఈ నెల 18వ తేదీ వరకు స్వామి వారి గ్రామ పర్యటనతో ముగుస్తుంది.స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేదిక సర్వాంగ సుందరంగా అలంకరించిచబడింది.
జాతరకు తెలంగాణలోని జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తారు.
కోరిన కోరికలు తీర్చాలని స్వామివారికి భక్తులు కోర మీసాలను సమర్పిస్తూ ఉన్నారు.ఉత్సవాల్లో భక్తుల కోసం తాగునీరు, వైద్య శిబిరం ఇతర మౌలిక వసతులకు కల్పిస్తున్నట్లు దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మడిశెట్టి కుమారస్వామి ఈవో కిషన్ రావు వెల్లడించారు.ఉత్సవాలకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ బ్రహ్మోత్సవాలలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం వీర బ్రహ్మ స్వామి వారి కళ్యాణం జరిగింది.
14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రాంతి పర్వదినాల రోజున బండ్ల ప్రదర్శన, 16వ తేదీన నాగవెల్లి పుష్పయాగం, 17వ తేదీన త్రిశూల స్నానం, 18వ తేదీన తెల్లవారుజామున అగ్నిగుండాలు అదే రోజున సాయంత్రం స్వామి వారి గ్రామ పర్యటనతో ఈ బ్రహ్మోత్సవాలు సంపూర్ణంగా ముగిసిపోతాయి.రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా స్వామివారి దేవాలయంలో దేవత వృక్షాలైన రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి కూడా ఉన్నాయి.ఫిబ్రవరి, మార్చి లో రాలిపడే రుద్రాక్షల కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు.
LATEST NEWS - TELUGU