సాధారణంగా పిండ ప్రధానం మన పూర్వీకుల గుర్తుగా వారి ఆత్మకు శాంతి కలగాలని పిండ ప్రధానం చేస్తారు.ముఖ్యంగా 15 రోజుల పాటు సాగే ఈ పితృపక్షంలో పితృ దేవతలకు పిండ ప్రదానం చేయడం ద్వారా ఎన్నో శుభాలు జరుగుతాయి.
అంతేకాకుండా పితృదేవతల ఆశీర్వాదం ఎల్లవేళలా మనకు కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పితృ పక్షంలో పిండ ప్రదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
సెప్టెంబర్ 2 నుండి పితృపక్షం మొదలైంది ఈ రోజుల్లో ఉదయం తొందరగా నిద్ర లేచి ఈ పనులు చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.మరి ఉదయం చేయాల్సిన పనుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ముఖ్యంగా చేయాల్సిన పని ఇంటి ముఖద్వారం పసుపు నీళ్లతో శుభ్రపరచుకోవాలి.ఫలితంగా ఇంట్లో నివసించే వారికి పురోగతి కలుగుతుంది.
అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తవు.కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలిగి ప్రేమానురాగాలు మొదలవుతాయి.
మూగజీవాలకు ఆహారం ఇవ్వడం ఎప్పుడైనా మంచి విషయమే, కానీ ఈ పితృపక్షంలో ఆవులకు అన్నం పెట్టడం లేదా పక్షులకు గింజలు వేయడం వంటి పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలను కలిగి ఉంటారు.అలాగే పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది.
ఒక గిన్నెలో నీరు పోసి దానిలో రొట్టె ముక్కలు వేసి ఇంటి పైకప్పుపై పెట్టడం ద్వారా మన ఇంట్లో సానుకూల పరిస్థితులు కనబడతాయి.పితృ పక్షంలో ఇలా చేయడం వల్ల వారు సంతృప్తి చెందడమే కాకుండా వారి ఆత్మకు శాంతి కలుగుతుంది.
అలాగే ఆ కుటుంబంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.
ఆవులకు ఆహారం ఇవ్వడం అనేది ఎంతో పుణ్యకార్యం.
పితృ పక్షంలో ఆవుల కుక్కలకు లేదా ఏదైనా మూగజీవాలకు ఆహారం ఇవ్వడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి.అలాగే అవసరానికి డబ్బు అందుతుంది.
పేదరికం నుండి విముక్తి పొందుతారు.
హిందూ ధర్మం ప్రకారం సంధ్యాసమయంలో సూర్యునికి నీరు సమర్పించడం ఎంతో ప్రత్యేకమైనది.
సూర్య భగవానుడికి నీటిని సమర్పించిన తర్వాత దక్షిణ దిశకు అభిముఖంగా నిల్చుని పితృదేవతలను స్మరిస్తూ మరొకసారి నీటిని వదలాలి.ఇలా చేయడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెంది వారి ఆత్మకు శాంతి కలుగుతుంది.