తిరుమల పుణ్యక్షేత్రానికి కాస్త తగ్గిన భక్తుల రద్దీ.. నిన్న హుండీ ఆదాయం ఎంతంటే..!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh రాష్ట్రంలోని తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎన్నోవేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.తిరుమల( Tirumala ) పుణ్య క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతూ ఉంది.

 The Crowd Of Devotees To The Tirumala Has Reduced , Andhra Pradesh, Tirumala ,-TeluguStop.com

వేసవి సెలవులు పూర్తి కావడంతో తిరుమల భక్తుల తాకిడి కాస్త తగ్గింది.ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజు స్వామి వారిని దాదాపు 72,000 మంది భక్తులు( Devotees ) దర్శించుకున్నారు.

ఇంకా చెప్పాలంటే స్వామి వారికి 32 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, దాదాపు నాలుగు కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా సమర్పించారు.ఇంకా చెప్పాలంటే సర్వదర్శనం భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుంది.ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.

Telugu Annaprasadam, Devotees, Devotional, Jaggery, Srikoluvu, Tirumala-Latest N

శ్రీవారి దేవాలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు కైంకర్యాలు నిర్వహించారు.ఇందులో భాగంగా బుధవారం రోజు ప్రత్యూష కాల ఆరాధనతో దేవాలయ ద్వారమును అర్చకులు తెరిచారు.అలాగే బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రం తో స్వామి వారిని మేలుకొల్పారు.ఆ తర్వాత తోమాల,అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి( Sri Koluvu Srinivasamurthy )ని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు.

Telugu Annaprasadam, Devotees, Devotional, Jaggery, Srikoluvu, Tirumala-Latest N

అలాగే శ్రీవారికి పంచాంగ శ్రవణం హుండీ జనాకర్షణ విన్నవించి బెల్లం( Jaggery )తో కలిపిన నువ్వుల పిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.ఇంకా చెప్పాలంటే స్వామి వారిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు.ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం,( Annaprasadam ) లడ్డూ, వడలు,చక్కెర పొంగలి, మిరియాల పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం, దద్దోజనం తో పాటు బెల్లం తో తయారు చేసిన పాయసంను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube