మీరు ఎప్పుడైనా ఆకాశం వైపు చూస్తూ కూర్చుని భూమిపై పడిపోతున్న నక్షత్రాన్ని( star ) చూశారా.పడిపోతున్న నక్షత్రాన్ని చూసేటప్పుడు చాలామంది తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉంటారు.
నక్షత్రం పడిపోతున్న సమయంలో మన కోరిక చెబితే అది నెరవేరుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఈ నమ్మకం ఇప్పటిది కాదు.
ఇది తరతరాలుగా ప్రజలు అనుసరిస్తున్న నమ్మకం.నక్షత్రాలు ఒక దానికి ఒకటి ఢీకొనడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
ఈ కారణంగా దానిని చూసేవారు అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటారు.రాలుతున్న నక్షత్రాన్ని చూసిన వ్యక్తి కోరిన కోరిక నిజంగా నెరవేరుతుందా? ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రాచీన కాలంలో రాత్రిపూట నక్షత్రాలను( Stars at night ) చూసి దిక్కులు నిర్ణయించే వారు.అలా ఊహిస్తూ అనేక ప్రవచనాలు కూడా చేసేవారు.అనాదిగా వస్తున్న నమ్మకాల ప్రకారం రాలిపోతున్నా నక్షత్రాన్ని చూడడం ఒక వ్యక్తి జీవితంలో మార్పును తెస్తుంది.ఆకాశం నుంచి రాలి పడిపోతున్న నక్షత్రాన్ని చూడడం ఎప్పుడూ మంచిది కాదు.
చాలామంది తమ కోరికను తీర్చమని పడిపోతున్న నక్షత్రాలను అడగడం అ శుభం అని భావిస్తారు.పురాతన కాలంలో వివిధ సంస్కృతుల ప్రజలు నక్షత్రాలను దిశల సూచికలుగా ఉపయోగించారు.
అలాగే ప్రాచీన కాలంలో నక్షత్రాలను చూసి పంటలను అంచనా వేసే వారు.రాలి పడిపోతున్న నక్షత్రం దేవతలు( Star gods ) శుద్ధికరణ విశ్వాసానికి సంబంధించిన రహస్యాలను వెల్లడిస్తుందని కొంతమంది ప్రజలు నమ్మేవారు.
ఇంకా చెప్పాలంటే రాలిపోతున్న నక్షత్రం ఆకాశంలో ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది.కానీ వాస్తవానికి అది నక్షత్రం కాదు.
రాలిపోతున్న నక్షత్రం( shooting star ) అంటే అంతరిక్షం నుంచి వచ్చి భూమి వాతావరణంతో ఢీకొనే ఆకాశంలో ఉండే చిన్న రాయి లేదా ధూళి.
ఈ రాయి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది ఘర్షణ కారణంగా కాలిపోతుంది.ఇది అద్భుతమైన వెలుగును సృష్టిస్తుంది.వాస్తవానికి పడిపోయిన నక్షత్రాలను ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్కలు( Meteorites ) అని పిలుస్తారు.
పురాతన నమ్మకాల ప్రకారం ఇది మన పూర్వీకులు రాలుతున్న నక్షత్రాన్ని భగవంతుని స్వరూపంగా భావించేవారు.తమ కోరికలు తీర్చమని నక్షత్రాలను అడిగే వారు.కానీ శాస్త్రీయ దృక్పణంలో ఇది ఉల్కపాతం మాత్రమేనని, మన కోరికలను తీర్చేది నక్షత్రం కాదని గ్రహించవచ్చు.
LATEST NEWS - TELUGU