కర్ణుడిని చంపడానికి శ్రీకృష్ణుడు చేసిన మాయ ఏమిటో తెలుసా..?

మన పురాణాల ప్రకారం విష్ణు భగవానుడు లోక సంరక్షణార్ధం ధర్మ విరుద్ధంగా ఎన్నో కార్యక్రమాలను చేశాడు.ధర్మాన్ని గాడి తప్పకుండా ఉండడం కోసం వివిధ రూపాలను అలంకరించి ధర్మాన్ని కాపాడాడు.

 Lord Krishna, Vishnumurti, Karna, Narayan, Reason Behind Sri Krishna Killed Karn-TeluguStop.com

దీనికోసం విష్ణుమూర్తి ఏకంగా పది అవతారాలను ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.ఇందులో ఒకటి శ్రీకృష్ణ అవతారం అని మనకు తెలిసిందే.

కృష్ణుని అవతారంలో విష్ణుమూర్తి కంసుడిని కర్ణుడిని మాయ చేసి చంపిన సంగతి మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది.అయితే కుంతీ పుత్రుడు అయిన కర్ణుడిని చంపడానికి శ్రీకృష్ణుడు ఎటువంటి మాయ చేశాడో ఇక్కడ తెలుసుకుందాం…

పూర్వం సూర్యుని పుత్రుడిగా కర్ణుడు సహస్ర కవచాలను ధరించి సమస్త లోకాలను ఎంతో బాధించేవాడు.

అయితే కర్ణుడుకి ఉన్న తపశ్శక్తి వల్ల దేవతలు సైతం కర్ణుడిని ఏమీ చేయలేకపోయారు.అయితే కర్ణుడు వల్ల ఎంతో విసుగు చెందిన దేవతలందరూ సాక్షాత్తు ఆ శ్రీహరి సాయం కోరారు.

సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కర్ణుడికి ఉన్న తపశ్శక్తి వల్ల అతనిని సంహరించడం వీలు కాదని భావించి విష్ణుమూర్తి నరుడు, నారాయణ రూపం ధరించాడు.

బద్రి ప్రాంతంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన నారాయణుడు కర్ణుడితో యుద్ధం చేసి తన రక్షణ కవచమును దూరం చేశాడు.

అదేవిధంగా నర రూపంలో మరలా కర్ణుడితో తలపడి కర్ణుడికి ఉన్న అన్ని రక్షణ కవచాలను దూరం చేస్తూ చివరికి 999 రక్షణ కవచాలు దూరం కాగా, ఒక కవచంతో కర్ణుడు సూర్యమండలంలో దాక్కున్నాడు.అప్పుడే ద్వాపర యుగం ప్రారంభం కావడంతో విష్ణుమూర్తి శ్రీకృష్ణుని అవతారమెత్తాడు.

దుర్వాస మహర్షి ఈ మంత్రం ఫలితంగా కుంతీదేవి సూర్యుని వల్ల కర్ణుడికి జన్మనిస్తుంది.ఈ విధంగా భూ లోకంలో జన్మించిన కర్ణుడిని విష్ణుమూర్తి తిరిగి కిరీటి, కృష్ణుడుగా ద్వాపరయుగంలో జన్మించారు.

ఆ తరువాత శ్రీకృష్ణుడు ఇంద్రుడు సహాయంతో కర్ణుడి చేత కవచ కుండలాలను దూరంచేసి కర్ణుడిని సంహరించినట్లు మనకు భారతం తెలియజేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube