ఆ దోషంవల్ల పెళ్లి ఆలస్యమవుతుంటే...ఈ ఆలయాని తప్పక దర్శించుకోవాలి.! ఎక్కడ ఉందంటే.?

వివాహం అనేది ప్రతీమనిషి జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టం.దాని గురించి పెద్దలు, పెళ్లి చేసుకునే యువతీ యువకులు కూడా ఎన్నో కలలు కంటారు.

 Problems In Marriages Visit That Temple-TeluguStop.com

అయితే కొన్ని కారణాలు వలన కొందరికి వివాహం ఆలశ్యం అవుతుంది.అన్ని సిద్దంగా ఉన్నా కూడా ఎన్ని సంభందాలు చూసినా కూడా సరైన సమయానికి అవకుండా ఏదో ఒక ఆటంకం వస్తుంది.

వివాహం వెంటనే జరిగిపోవాలని దేవుళ్లను మొక్కుకుంటారు.త్వరగా పెళ్లి కుదరటం కోసం ఇలా చేస్తే మంచిది.

నాగదోషం ఉండడం వల్ల పెళ్లి ఆలస్యమవుతూ ఉంటుంది.అలాంటి వారు తప్పక దర్శించాల్సిన ఆలయం ఒకటి ఉంది.అదే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, మోపిదేవి, కృష్ణా జిల్లా.దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది మోపిదేవి కుమారక్షేత్రం.కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం

స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది.గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది.

ఇదే పానవట్టం.స్వామికి వేరే పానవట్టం ఉండదు.

పానవట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది.అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోస్తారు.

ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు.

సంతానం లేనివారికి సంతానం కలిగించడం, పెళ్లి కాని వారికి వివాహ యోగ్యం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో వరాలు లభిస్తాయని నమ్మకం.

కృష్ణాజిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం లోనూ, మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరం లోనూ, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరం లోనూ మోపి దేవి క్షేత్రం ఉంది.అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ రేపల్లె.ఈ ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు.నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు ప్రత్యేక పూజలు జరిపించు కుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube