గ్రీన్ టీని తాగ‌లేక‌పోతున్నారా? అయితే ఇలా చేయండి..టేస్ట్‌తో పాటు ఎన్నో లాభాలు!

గ్రీన్ టీ.దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 If You Drink Green Tea In This Way, You Can Get Many Health Benefits! Green Tea,-TeluguStop.com

ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌ పై శ్రద్ధ వహించే ప్రతి ఒక్కరూ తమ డైట్ లో గ్రీన్ టీను చేర్చుకుంటారు.గ్రీన్ టీ వల్ల వెయిట్ లాస్ తో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల సైతం లభిస్తాయి.

అయితే చాలా మందికి గ్రీన్ టీ టేస్ట్ అస్స‌లు నచ్చదు.ఈ క్రమంలోనే గ్రీన్ టీని తాగడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే విధంగా గ్రీన్ టీని తీసుకుంటే టేస్ట్ తో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను సైతం సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ టీని ఎలా తీసుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ ను తీసుకుని అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్‌ను వేసి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక యాపిల్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే అర అంగుళం అల్లం ముక్కను పొట్టు తొల‌గించి ముక్కలుగా కట్ చేయాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ టీ ను వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అంటే హెల్తీ డ్రింక్ సిద్దమవుతుంది.

Telugu Apple, Fitness, Green Tea, Tips, Latest-Telugu Health Tips

దీనిని రోజు మార్నింగ్ టైం లో తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.మెదడు పనితీరు మెరుగుపడుతుంది.వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.నీరసం, అలసట, ఒత్తిడి వంటివి దూరం అవుతాయి.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.మరియు చర్మం యవ్వనంగా కూడా మెరుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube