రోజురోజుకు జుట్టు విపరీతంగా రాలిపోతుంది.కానీ కొత్త జుట్టు రావడం లేదా.? హెయిర్ గ్రోత్ అనేది లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.ఈ సమస్యకు అడ్డుకట్ట వేయకపోతే కొద్ది రోజుల్లోనే జుట్టు పలుచగా మారిపోతుంది.
అయితే వారానికి ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టోనర్ ను వాడితే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే రెండు రెబ్బల కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ నువ్వులు( Sesame seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Cloves ), నాలుగు నుంచి ఐదు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి కనీసం పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేస్తే హెయిర్ టోనర్ సిద్ధం అయినట్టే.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు తయారు చేసుకున్న టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే హెయిర్ గ్రోత్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.స్కాల్ప్ ఆరోగ్యంగా శుభ్రంగా మారుతుంది.తల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
కాబట్టి హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసి జుట్టును ఒత్తుగా పెంచుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడేందుకు ప్రయత్నించండి.
