అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కిన కాంబో ప్రేక్షకులకు చాలా ఇష్టం.మరి ఆ కాంబో ఏంటో మీకు కూడా తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్( Mahesh babu, Trivikram srinivas ).ఈ ఇద్దరు ఇప్పుడు ముచ్చటగా మూడవసారి కూడా కలిసి పనిచేయ బోతున్నారు.అల వైకుంఠపురములో తర్వాత మరో సినిమాను రిలీజ్ చేయని త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తున్నాడు.
వీరిద్దరి కాంబోలో తాజాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.
సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాను ప్రకటించి పూర్తి చేస్తున్నాడు.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్.ఇక త్వరలోనే మరో అప్డేట్ రాబోతుంది.సూపర్ స్టార్ కృష్ణ( Super star Krishna ) జయంతి రోజున అంటే మే 31న ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే నిర్మాత తెలిపారు.మరి ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ అప్డేట్ గురించి చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా నిర్మాత నాగవంశీ( Nagavamshi ) ‘లోడింగ్’ అంటూ పవర్ఫుల్ ఎమోజీని జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ తాలూకు అఫిషియల్ అప్ డేట్ ఈ రోజు కానీ రేపు కానీ రానుంది అని టాక్.మొత్తానికి భారీ ప్లానింగ్ తోనే లోడింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.కాగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.







