మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.అయితే వాటి వెనుక అర్థం పరమార్థం దాగి ఉంది.
పురాణాల ప్రకారం ధర్మం పక్కదారి పట్టినప్పుడు ఈ లోకంలో ధర్మాన్ని కాపాడటానికి సాక్షాత్తు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ విష్ణు భగవానుడు వివిధ అవతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాడు.ఆ విధంగా ఒక్కో యుగంలో ఒక్కో అవతారాన్ని ఎత్తాడు.అయితే ఇక్కడ ఆ శ్రీహరి ఎన్ని అవతారాలు ఎత్తాడు మనం తెలుసుకుందాం.
1) మత్స్య అవతారం: హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్రంలో దాచి పెట్టగా ఆ వేదాలను తిరిగి బ్రహ్మ దగ్గరకు చేర్చడానికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు మత్స్య అవతారమెత్తి సముద్ర గర్భంలోకి వెళ్లి వేదాలను తీసుకొని తిరిగి బ్రహ్మకు అందజేస్తాడు.
2) కూర్మావతారం: దేవతలు, రాక్షసులు సముద్ర మధనం చేస్తున్న సమయంలో కవ్వంగా ఉన్న మందరపర్వతం సముద్రంలో మునిగి పోతున్న సమయంలో ఆ విష్ణుభగవానుడు కూర్మావతార మెత్తి మంధర పర్వతం కింద ఆసరాగా ఉంటాడు.ఆ విధంగా సముద్రం నుంచి అమృతం ఉద్భవిస్తుంది.
3) వరాహ అవతారం: హిరణ్యాక్షుడు అనే రాక్షసుల రాజు దేవతలను గెలిచి స్వర్గాన్ని ఆక్రమించేటప్పుడు యజ్ఞం నిర్వహిస్తుంటాడు.అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడు యజ్ఞం చెడగొడతాడు.
4) నరసింహ అవతారం: హిరణ్యాక్షుడి తర్వాత తన సోదరుడు హిరణ్యకశిపుడు దేవలోకాలను ఆక్రమించడం కోసం యజ్ఞ భాగాలను అపహరించడం విష్ణు భగవానుడు నరసింహ అవతారం లో అతని సంహరించాడు.
5) వామన అవతారం: బలిచక్రవర్తి ఇంద్రుడు స్వర్గం నుంచి దేవతలను త్వరగా శ్రీహరి వామనుడి అవతారమెత్తి బలి చక్రవర్తిని మూడు అడుగుల స్థలం అడుగుతాడు.రెండడుగులు ఆకాశం భూమి పై పెట్టి మూడవ అడుగు బలి చక్రవర్తి మీద పెట్టి అధఃపాతాళానికి తొక్కేస్తాడు.
6) పరశురాముడు: శ్రీ హరి అంశతో జమదగ్నికి పరశురాముడు పుట్టి, మదాంధులైన రాజులను ఇరవైఒక్కసార్లు దండయాత్రలు చేసి సంహరిస్తాడు.
7) శ్రీ రాముడు: రావణ, కుంభకర్ణులను సంహరించడానికి దేవతలు ప్రార్థించిన తరువాత దశరధుని మహారాజుకు శ్రీరాముడిగా జన్మించి సీత అపహరణ తరువాత రావణాసురుడు ,కుంభకర్ణులను చంపుతాడు.
8) కృష్ణావతారం: ద్వాపరయుగంలో అధర్మప్రవృత్తులైన రాజులవల్ల భూభారం పెరగటం వల్ల భూదేవి కోరిక మేరకు విష్ణు భగవానుడు కృష్ణావతారంలో జన్మించి కంసుడును సంహరిస్తాడు.
9) బుద్ధావతారం: ఒకప్పుడు రాక్షసులు విజృంభించి, దేవలోకంపై దండెత్తి, దేవతలను ఓడించి తరిమివేశారు.దేవతలు ప్రార్థించగా మాధవుడు, బుద్ధావతారంలో శుద్ధోదనుని కుమారుడిగా జన్మిస్తాడు.
10) కల్కి అవతారం: బుద్ధుడి బోధనలు వల్ల అధర్మపరులయిన రాజులు ప్రజాకంటకులై ప్రవర్తిస్తారు.ప్రజలు కూడా అన్యాయంగా వేదకర్మలను ఆచరించరు.
అప్పుడు కలియుగంలో విష్ణుయశుడనుడికి శ్రీహరి, కల్కిరూపంతో జన్మించాడు.ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించాడు.
DEVOTIONAL