విష్ణుమూర్తి అవతారాలు ఎన్నో తెలుసా..?

విష్ణుమూర్తి అవతారాలు ఎన్నో తెలుసా?

మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.అయితే వాటి వెనుక అర్థం పరమార్థం దాగి ఉంది.

విష్ణుమూర్తి అవతారాలు ఎన్నో తెలుసా?

పురాణాల ప్రకారం ధర్మం పక్కదారి పట్టినప్పుడు ఈ లోకంలో ధర్మాన్ని కాపాడటానికి సాక్షాత్తు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ విష్ణు భగవానుడు వివిధ అవతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాడు.

విష్ణుమూర్తి అవతారాలు ఎన్నో తెలుసా?

ఆ విధంగా ఒక్కో యుగంలో ఒక్కో అవతారాన్ని ఎత్తాడు.అయితే ఇక్కడ ఆ శ్రీహరి ఎన్ని అవతారాలు ఎత్తాడు మనం తెలుసుకుందాం.

1) మత్స్య అవతారం: హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్రంలో దాచి పెట్టగా ఆ వేదాలను తిరిగి బ్రహ్మ దగ్గరకు చేర్చడానికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు మత్స్య అవతారమెత్తి సముద్ర గర్భంలోకి వెళ్లి వేదాలను తీసుకొని తిరిగి బ్రహ్మకు అందజేస్తాడు.

2) కూర్మావతారం: దేవతలు, రాక్షసులు సముద్ర మధనం చేస్తున్న సమయంలో కవ్వంగా ఉన్న మందరపర్వతం సముద్రంలో మునిగి పోతున్న సమయంలో ఆ విష్ణుభగవానుడు కూర్మావతార మెత్తి మంధర పర్వతం కింద ఆసరాగా ఉంటాడు.

ఆ విధంగా సముద్రం నుంచి అమృతం ఉద్భవిస్తుంది.3) వరాహ అవతారం: హిరణ్యాక్షుడు అనే రాక్షసుల రాజు దేవతలను గెలిచి స్వర్గాన్ని ఆక్రమించేటప్పుడు యజ్ఞం నిర్వహిస్తుంటాడు.

అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడు యజ్ఞం చెడగొడతాడు. """/"/ 4) నరసింహ అవతారం: హిరణ్యాక్షుడి తర్వాత తన సోదరుడు హిరణ్యకశిపుడు దేవలోకాలను ఆక్రమించడం కోసం యజ్ఞ భాగాలను అపహరించడం విష్ణు భగవానుడు నరసింహ అవతారం లో అతని సంహరించాడు.

5) వామన అవతారం: బలిచక్రవర్తి ఇంద్రుడు స్వర్గం నుంచి దేవతలను త్వరగా శ్రీహరి వామనుడి అవతారమెత్తి బలి చక్రవర్తిని మూడు అడుగుల స్థలం అడుగుతాడు.

రెండడుగులు ఆకాశం భూమి పై పెట్టి మూడవ అడుగు బలి చక్రవర్తి మీద పెట్టి అధఃపాతాళానికి తొక్కేస్తాడు.

6) పరశురాముడు: శ్రీ హరి అంశతో జమదగ్నికి పరశురాముడు పుట్టి, మదాంధులైన రాజులను ఇరవైఒక్కసార్లు దండయాత్రలు చేసి సంహరిస్తాడు.

"""/"/ 7) శ్రీ రాముడు: రావణ, కుంభకర్ణులను సంహరించడానికి దేవతలు ప్రార్థించిన తరువాత దశరధుని మహారాజుకు శ్రీరాముడిగా జన్మించి సీత అపహరణ తరువాత రావణాసురుడు ,కుంభకర్ణులను చంపుతాడు.

"""/"/ 8) కృష్ణావతారం: ద్వాపరయుగంలో అధర్మప్రవృత్తులైన రాజులవల్ల భూభారం పెరగటం వల్ల భూదేవి కోరిక మేరకు విష్ణు భగవానుడు కృష్ణావతారంలో జన్మించి కంసుడును సంహరిస్తాడు.

"""/"/ 9) బుద్ధావతారం: ఒకప్పుడు రాక్షసులు విజృంభించి, దేవలోకంపై దండెత్తి, దేవతలను ఓడించి తరిమివేశారు.

దేవతలు ప్రార్థించగా మాధవుడు, బుద్ధావతారంలో శుద్ధోదనుని కుమారుడిగా జన్మిస్తాడు.10) కల్కి అవతారం: బుద్ధుడి బోధనలు వల్ల అధర్మపరులయిన రాజులు ప్రజాకంటకులై ప్రవర్తిస్తారు.

ప్రజలు కూడా అన్యాయంగా వేదకర్మలను ఆచరించరు.అప్పుడు కలియుగంలో విష్ణుయశుడనుడికి శ్రీహరి, కల్కిరూపంతో జన్మించాడు.

ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించాడు. """/"/.

వామ్మో, ఇదేం అద్భుతం.. 66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

వామ్మో, ఇదేం అద్భుతం.. 66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!