శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం.. శ్రీవారి బంగారు వాకిలి దగ్గర..?

ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఉగాది వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.ముందు రోజే స్వామి వారి దేవాలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.

 A Rare Opportunity For Tirumula  Devotees.. Near The Golden Gate Of Tirumula ,-TeluguStop.com

తెల్లవారుజాము నుంచే శ్రీవారి దేవాలయం( Tirumula )లో ప్రత్యేక కార్యక్రమాలు మొదలుపెట్టారు.బంగారు వాకిలి దగ్గర ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ప్రత్యేక పర్వదినం వేల విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

అదే సమయంలో ఈ నెల 30, 31వ తేదీల్లో శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో ప్రతి సంవత్సరం ఉగాది ఆణివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.మంగళవారం శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Telugu Andhra Pradesh, Bangaru Vakili, Devotees, Devotional, Golden Gate, Tirumu

ఈ సమయంలో శ్రీవారి మూలవిరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు.ప్రతి సంవత్సరం ఉగాది రోజు తిరుమలలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు.ఉగాది రోజు ఉదయం నుంచి ఉగాది రోజు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లప్ప స్వామి వారికి మరియు విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు.

విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా దేవాలయంలోకి ప్రవేశిస్తారు.ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్ కు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింప చేస్తారు.ఆ తర్వాత పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి( Bangaru vakili ) వద్ద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.ఈ నెల 30వ తేదీన రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య బంగారు వాకిలి దగ్గర శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారు.31వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి దగ్గర ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.ఈ శ్రీరామనవమి ఉత్సవాల వేళ సహస్ర దీపాలంకరణ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube