భారతదేశంలో పెళ్లి జరిగిన ఆడవారు కొన్ని రకాల ఆచారాలను, సంప్రదాయాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.అందులో ముఖ్యమైనది మంగళసూత్రం.
పెళ్లి అయిన ఆడవారు మంగళసూత్రాన్ని ఎదుటి వ్యక్తులకు కనిపించకుండా దాచుకుంటూ ఉంటారు.కానీ కొంతమంది ఆడవారికి మాత్రం ఈ విషయం తెలియదు.
అలాగే వారి మెడలో ఉన్న మంగళసూత్రం ఏదైనా కారణంగా తెగిపోయినప్పుడు మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసేసి దానికి బదులుగా ఒక పసుపు తాడును కట్టుకునే ఆచారం భారతదేశంలో ఉంది.ఆడవారు తాళిబొట్టుకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు అన్న విషయం దాదాపు చాలామందికి తెలుసు.
పూర్వం రోజులలో మెడలో తాళిని నల్లటి మట్టితో తయారుచేసిన నల్లటి పూసలను ధరించేవారు.ఆ మట్టితో చేసిన నల్లపూసలు చాతిపై ఉత్పన్నమయ్యే ఉష్టాన్ని పీల్చుకునేవి.
అంతేకాకుండా అవి పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని చాలామంది ప్రజలు నమ్మేవారు.కానీ ఇప్పటి నల్లపూసలు వేసుకోవడమే చాలామంది మానేశారు.
ప్రతి ఒక్కరూ మెడలో నల్లపూసలకు బదులుగా బంగారు తలిని వేసుకోవడం ప్రారంభించారు.బంగారు గొలుసు వేసుకోవడం వల్ల మన శరీరంలోని వేడితో పాటు ఇంకా వేడి పెరిగి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు అనాహత చక్రం ఉంది.మెడ భాగంలో విశుద్ధ చక్రముంది.ఆ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల గొంతు భాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు దూరమవుతాయి.అందుకే అటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తలకు తప్ప ఇతరులకు కనిపించేలా పైన వేసుకోకూడదు.
మంగళసూత్రంపై వేరొకరి దృష్టి పడడం అంత మంచిది కాదు.అయితే ఈ మధ్యకాలంలో నల్లపూసల తాడుకు ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు.

పూర్వకాలంలో మంగళసూత్రానికి నల్లటి పూసలను అమర్చి తయారు చేసేవారు వివాహానికి సంబంధించిన అన్ని విషయాలలో నలుపు రంగును పక్కన పెడుతూ వచ్చారు.అందువల్ల నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చి తయారు చేయడం పట్ల కొంత మంది అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు.కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా మంగళసూత్రం భర్తకు తప్ప ఇతరులకు కనిపించకుండా మెడలో వేసుకోవడం మంచిది.