కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ప్రజలను తీవ్రస్థాయిలో భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే.దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారు.
అయితే కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావం చూపలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే కొంతమంది కరోనా నిబంధనలు సరిగ్గా పాటించకపోయినా వైరస్ సోకలేదు.
ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లలో కరోనా వైరస్ సోకని వాళ్లు చాలామంది ఉన్నారు.వీళ్లలో కొంతమందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవడం వల్ల కరోనా సోకలేదని భావిస్తున్నారు.
మరి కొందరికి మాత్రం నిజంగానే కరోనా సోకలేదు.అయితే కరోనా సోకని వాళ్లలో చాలామందికి సాధారణ జలుబు, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఏర్పడిన ఇమ్యూనిటీ పవర్ కరోనా సోకకుండా చేసిందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది.

లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో టీ సెల్స్ పుష్కలంగా ఉన్నవాళ్లు కరోనా బారిన పడలేదని వెల్లడైంది.మరోవైపు ఇప్పటికే కరోనావైరస్ సోకిన వాళ్లకు సైతం సహజంగా వ్యాధి నిరోధకత ఉంటుంది.అందువల్ల ఒకసారి వైరస్ సోకిన వాళ్లకు మళ్లీ వైరస్ సోకే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.అయితే కరోనా నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటిస్తే మంచిది.
ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు వెంటనే వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమంది గుండెపోటుతో మరణిస్తున్నా కరోనాకు, గుండెపోటుకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.
కరోనా వ్యాక్సిన్ల విషయంలో అపోహలు వద్దని కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటం గమనార్హం.