న్యూజిలాండ్ (New Zealand)ఆకాశంలో నిన్న (ఏప్రిల్ 11) ఓ అద్భుతం జరిగింది.అదిగో, అదిగో అంటూ అందరూ పైకి చూస్తుండగానే నింగిలో ఓ భారీ వెలుగు బంతి దూసుకొచ్చింది.
ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని ‘అగ్నిగోళం’(Astronomers,fireball) అంటున్నారు.ఏప్రిల్ 10 సాయంత్రం 5:05 UTC సమయానికి (భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 11 ఉదయం 5:05 గంటలకు) న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్ మధ్యలో మొదలైన ఈ వెలుగు హాక్స్ బే దగ్గర సముద్రం వైపు వెళ్లిపోయింది.కేవలం 8 సెకన్లే కానీ ఆ 8 సెకన్లలో రాత్రిపూట ఆకాశం పగలులా మారిపోయింది.చూసినోళ్లంతా షాక్ తిన్నారు.ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సింపుల్‌గా చెప్పాలంటే ఇది నింగి నుంచి జారిపడే ఓ పెద్ద ఉల్క.
దీన్ని ఇంగ్లీషులో ‘ఫైర్‌బాల్’ అంటారు.ఇది మామూలు ఉల్కల్లా కాదు, వీనస్ గ్రహం(Planet Venus) కంటే కూడా చాలా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.
అంతరిక్షంలో తిరిగే రాళ్లు భూమి వాతావరణంలోకి దూసుకొచ్చినప్పుడు ఇలా జరుగుతుంది.
ఆ రాళ్లను ‘మెటియోరాయిడ్’(Meteoroid) అని కూడా అంటారు.భూమి వాతావరణంలోకి రాగానే గాలి రాపిడికి ఆ రాయి వేడెక్కి మండిపోతుంది.అప్పుడే మనకు ఆకాశంలో ఇంత పెద్ద వెలుగు కనిపిస్తుంది.
కొన్నిసార్లు రాయి మరీ పెద్దగా ఉంటే పూర్తిగా కాలిపోకుండా చిన్న ముక్కలు భూమిపై పడతాయి.వాటినే ‘మెటియోరైట్స్’ అంటారు.
ఈ అగ్నిగోళం సీన్ మామూలుగా లేదు.దీన్ని చాలా మంది కెమెరాల్లో రికార్డ్ చేశారు.ముఖ్యంగా ఖగోళ శాస్త్రవేత్తలు రాత్రిపూట ఆకాశాన్ని గమనించడానికి వాడే స్పెషల్ కెమెరాలు ‘RMS (రిమోట్ మెటియోర్ స్టేషన్)’లలో కూడా ఇది స్పష్టంగా రికార్డ్ అయింది.‘ఫైర్‌బాల్స్ అయోటిరోవా’ అనే గ్రూప్ వాళ్లు ఈ వీడియోలు చూసి ఇది నిజంగానే అగ్నిగోళమే అని కన్ఫర్మ్ చేశారు.ఈ గ్రూప్ రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ న్యూజిలాండ్‌లో(New Zealand) ఒక భాగం.వాళ్లు చెప్పిన దాని ప్రకారం కొన్ని కెమెరాల్లో అయితే ఈ అగ్నిగోళం అదుర్స్ అనిపించేంత క్లియర్‌గా కనిపిస్తుంది.
ఇంత పెద్ద సీన్ జరిగినా దీన్ని కళ్లారా చూసిన వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు.ఇంటర్నేషనల్ మెటియోర్ ఆర్గనైజేషన్ (IMO) వాళ్లకు ఒక్క సాక్షి మాత్రమే రిపోర్ట్ చేశాడు.ఎందుకంటే ఇది జరిగింది తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో.అప్పటికి చాలా మంది నిద్రలో ఉంటారు.ఈ అగ్నిగోళం సముద్రం వైపు వెళ్లిపోయింది కాబట్టి, దాని ముక్కలు ఏమైనా దొరుకుతాయా అని వెతకడం వేస్ట్.ఒకవేళ ఏమైనా ముక్కలు మిగిలి ఉన్నా అవి సముద్రంలో పడిపోయి ఉంటాయి.
వాటిని వెతికి పట్టుకోవడం కష్టం.ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే అంతరిక్షం ఎంత యాక్టివ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మన ఆకాశంలో ఇంకా ఎన్నో మిస్టరీలు దాగున్నాయి అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.