అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు.ఇందులో భాగంగానే మచ్చలేని తెల్లటి మెరిసే ముఖ చర్మం( Spotless Skin ) కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.
అటువంటి చర్మాన్ని పొందడానికి ఖరీదైన స్కిన్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే చర్మ ఉత్పత్తుల్లో ఎన్నో రసాయనాలు రసాయనాలు నిండి ఉంటాయి.
ఆ ప్రొడక్ట్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.చర్మానికి నష్టం మాత్రం కచ్చితంగా కలుగుతుంది.
అందుకే సహజంగానే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక మీరు ట్రై చేశారంటే స్పాట్ లెస్ వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
![Telugu Tips, Remedyspotless, Remedy, Latest, Shiny Skin, Skin Care, Skin Care Ti Telugu Tips, Remedyspotless, Remedy, Latest, Shiny Skin, Skin Care, Skin Care Ti](https://telugustop.com/wp-content/uploads/2024/04/Rose-Milk-Aloevera-Face-Pack.jpg)
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వేప పొడిని వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.చివరిగా సరిపడా కాచి చల్లార్చిన పాలు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల అద్భుతమైన బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా వేప పొడి చర్మం పై మొటిమలు( Pimples ) మరియు మొండి మచ్చలను సమర్థవంతంగా నివారిస్తుంది.
![Telugu Tips, Remedyspotless, Remedy, Latest, Shiny Skin, Skin Care, Skin Care Ti Telugu Tips, Remedyspotless, Remedy, Latest, Shiny Skin, Skin Care, Skin Care Ti](https://telugustop.com/wp-content/uploads/2023/06/A-simple-home-remedy-for-getting-spotless-skin-naturallya.jpg)
అలాగే గులాబీ రేకుల పొడి( Rose Petals Powder ) చర్మ ఛాయను పెంచుతుంది.స్కిన్ కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.ఇక అలోవెరా జెల్ మరియు పాలు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.స్కిన్ డ్రై( Dry Skin ) అవ్వకుండా కాపాడుతాయి.మృదువుగా మెరిపిస్తాయి.ఫైనల్ గా ఈ రెమెడీని తరచూ పాటించడం వల్ల మచ్చలేని తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.