టాలీవుడ్ హీరో రామ్ చరణ్( Hero Ram Charan ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా పెద్ది.బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చరణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరిగిన విషయం తెలిసిందే.
ఈ షెడ్యూల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు.అమెరికాలో క్యాన్సర్ చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత షూటింగ్లో పాల్గొన్నారు శివరాజ్ కుమార్.
తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారు.కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ( Upendra, Raj B Shetty )నటిస్తోన్న 45 మూవీలో శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్ శివుడిగా, ఉపేంద్ర యముడిగా, రాజ్ బి శెట్టి మార్కండేయగా కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్.ఈ సమావేశంలో ఉపేంద్రతో పాటు శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.రామ్ చరణ్ పెద్ది మూవీ( Peddi movie ) కోసం 2 రోజులు షూట్ చేశాము.

ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది.తొలిసారి తెలుగులో మాట్లాడాను.డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్.నా షాట్ ను ఆయన అభినందించారు.రామ్ చరణ్ బిహేవియర్ వెరీ గుడ్.ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను.
పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్.బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది.
నాకు కీమో థెరపీ కంప్లీట్ చేసిన 4 రోజులకే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాను.టీమ్ అందరూ ఇచ్చిన సపోర్ట్ తోనే షూట్ చేయగలిగాను అని అన్నారు.
ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.