వింటర్ లో రోజు ఉదయం ఈ టీ తాగితే జబ్బులన్నిటికి దూరంగా ఉండొచ్చు.. తెలుసా?

వింటర్ సీజన్( Winter season ) స్టార్ట్ అయ్యింది.చలి రోజురోజుకు పెరుగుతోంది.

 Best Tea For Good Health During Winter! Good Health, Health, Health Tips, Latest-TeluguStop.com

ఈ సీజన్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.మంచు పొగలు మనసుకు ఎంతో హాయిని ఇస్తుంటాయి.

అయితే చలికాలం వస్తూ వస్తూనే కొన్ని జబ్బులను కూడా తనతో పాటు తీసుకొస్తుంది.ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు వాపు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మ అలర్జీలు వంటివి బాగా ఇబ్బంది పెడుతుంటాయి.

వీటన్నిటికి దూరంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే టీను వింటర్ లో రోజు ఉదయం తీసుకుంటే సీజనల్ జబ్బులన్నిటికి దూరంగా ఉండవచ్చు.

మరి ఇంతకీ ఆ టీ ఏంటి.ఎలా తయారు చేసుకోవాలి.

అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ), పావు టేబుల్ స్పూన్ పసుపు( turmaric ), వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, రెండు లేదా మూడు లెమన్ స్లైసెస్ వేసుకుని ఆరు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Care, Tips, Healthy Tea, Latest, Tea-Telugu Health

ఆ తర్వాత అందులో రెండు గ్రీన్ టీ బ్యాగ్స్( Green tea bags ) వేసి మరో నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.తద్వారా మన టీ సిద్ధం అవుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని టీను ఫిల్టర్ చేసుకోవాలి.

ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత‌ సేవించాలి.ఈ టీ ప్రస్తుత చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Telugu Care, Tips, Healthy Tea, Latest, Tea-Telugu Health

ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.రోజు ఉదయం ఈ టీ తాగితే రోగ‌ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దీంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.అలాగే ఈ టీ ఆస్తమా లక్షణాలను అదుపులో ఉంచుతుంది.

బాడీని డీటాక్స్ చేస్తుంది.వెయిట్ లాస్ కు అద్భుతంగా తోడ్పడుతుంది.

కాబట్టి ఈ వింటర్ సీజన్లో హెల్తీగా, హ్యాపీగా ఉండాలంటే తప్పకుండా ఈ టీను డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube