బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఈ ఆహారాలను అస్సలు మిస్ అవ్వకండి!

సాధారణంగా కొందరు చాలా సన్నగా, బలహీనంగా ఉంటారు.ఎప్పుడు నీరసంగా కనిపిస్తారు.

 Healthy Foods To Gain Weight Fast Details! Healthy Foods, Body Weight, Weight Ga-TeluguStop.com

ఏ పని చెప్పినా చేయడానికి ఇష్టపడరు.ఒకవేళ కొంచెం పని చేసినా కూడా త్వరగా అలసిపోతుంటారు.

నిజానికి ఓవర్ వెయిట్( Over Weight ) మాత్రమే కాదు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉన్నా కూడా అలాంటి సమస్యలే తలెత్తుతుంటాయి.అందుకే హైట్ కు తగ్గట్లుగా బాడీ వెయిట్ ను మెయింటైన్ చేయాలి.

ఈ క్రమంలోనే కొందరు బరువు పెరగడానికి( Weight Gain ) ప్రయత్నిస్తూ ఉంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను అస్సలు మిస్ అవ్వకండి.

పచ్చి కొబ్బరి తురుము( Raw Coconut ) బరువు, బలాన్ని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

పచ్చి కొబ్బరిలో పోషకాలు మెండుగా ఉంటాయి.రోజుకు రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము తింటే చక్కగా వెయిట్ గెయిన్ అవుతారు.

స్ట్రాంగ్ గా మారతారు.అలాగే తక్కువ బరువు ఉన్నవారు రోజు ఉదయం అర గుప్పెడు నానబెట్టిన వేరుశనగలను తీసుకోవాలి.

నానబెట్టిన వేరుశనగల్లో( Soaked Peanuts ) పోషకాలతో పాటు క్యాలరీలు అధికంగా ఉంటాయి.అందువల్ల నానబెట్టిన వేరుశనగలు తీసుకుంటే బరువు పెరుగుతారు.

Telugu Badam, Foods, Curd, Tips, Healthy Foods, Latest, Raw Coconut, Soaked Pean

బరువును పెంచడానికి మొలకెత్తిన గింజలు కూడా హెల్ప్ చేస్తాయి.అందుకే నిత్యం మొలకెత్తిన పెసలు, బొబ్బర్లు, అలసందలను ఆహారంలో భాగం చేసుకోవాలి.ఇవి బరువుతో పాటు ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తాయి.అలాగే మధ్యాహ్నం భోజనంలో రెండు మూడు కూరలతో రైస్ ను తీసుకోవాలి.రోజుకు ఒక కప్పు పెరుగు( Curd ) తినాలి.

Telugu Badam, Foods, Curd, Tips, Healthy Foods, Latest, Raw Coconut, Soaked Pean

ఇక సాయంత్రం స్నాక్స్ సమయంలో నానబెట్టిన వాల్ నట్స్,( Walnuts ) బాదం పప్పు తో( Badam ) పాటు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఖ‌ర్జూరం వంటివి తీసుకోవాలి.ఇవి హెల్త్ కు ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా వెయిట్ గెయిన్ కు హెల్ప్ చేస్తాయి.

సాయంత్రం వేళ చిరుతిళ్లకు బదులుగా వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.బలంగా మారతారు.

నీరసం, అలసట దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ప్రతి పనిలో చురుగ్గా పాల్గొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube