జ్వరంతో బాధపడే వారికి వెంటనే ఉపశమనం కలిగించే సూపర్ ఫుడ్స్..!

జ్వరం అనేది శరీరం తనను తాను మరమత్తులు చేసుకొనే క్రమంలోవస్తుంది .దీని ద్వారా హానికరమైన బాక్టీరియా, క్రిములు, వైరస్‌లు శరీరం నుంచి బయటికి వెళ్లగొట్టబడతాయి.

 Indian Foods To Eat During Fever-TeluguStop.com

కాకపోతే వీటి వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది.వేరే ఇతర క్రిములు పెరగకుండా ఉండేందుకే శరీరం వెచ్చబడుతుంది.

అయితే మనలో అనేక మంది జ్వరం వస్తే ఏం తినాలి? ఏం తినాలో అర్ధం కాకా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారి కోసమే ఈ వీడియో తప్పక చూడండి.

చపాతీ
చపాతీలు చాలా తేలికగా జీర్ణం అవుతాయి.జ్వరం వచ్చినపుడు నెయ్యి లేదా నూనె వేయకుండా తయారుచేసిన చపాతీలను తినటం మంచిది.

ఉడికించిన అన్నం ఉడికించిన అన్నం తొందరగా జీర్ణం అవుతుంది.దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండుట వలన శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది.

సూప్
సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు దగ్గు,జలుబు కూడా వచ్చేస్తూ ఉంటాయి.వీటి ఉపశమనం కొరకు వేడి వేడిగా టమోటో లేదా క్యారెట్ సూప్ తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా మీద పోరాటం చేస్తుంది.


కిచిడి
చాలా తేలికగా ఉండి తొందరగా జీర్ణం అవుతుంది.కొంచెం నిమ్మకాయ ఆవకాయ వేసుకొని తినవచ్చు.

ఉడికించిన బంగాళాదుంపలు
ఉడికించిన బంగాళాదుంప ముక్కలలో కొద్దిగా బ్లాక్ పెప్పర్ మరియు లవంగాల వంటి పొడులు చల్లి తినటం వల్ల జర్వంతో పాటు వచ్చే జలుబు, దగ్గుకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.

ఆపిల్స్
ఆపిల్స్ తినటం వలన శరీరం హైడ్రేడ్ గా ఉంటుంది.

శరీరంలో తెల్ల మరియు ఎర్రరక్త కణాల సెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది.అలాగే రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది.

పండ్ల రసాలు
బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు, నీరు మరియు పండ్ల రసాల వంటి ద్రవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.పానీయాలు డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి.

తులసి టీ
జర్వంతో పాటు వచ్చే దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పికి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.జర్వంలో మీ మూడ్ బాగోలేనప్పుడు రిఫ్రెషింగ్ కోసం ఒక కప్పు తులసి టీ తాగి చూడండి.

గుడ్డు
ఉడికించి గుడ్లు పూర్తి పోషకాంశాలు కలిగి ఉంటుంది.ముఖ్యంగా గుడ్డు తెల్లసొన రెడ్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది.ఇది శరీరంలోని వివిధ రకాల ఇన్ఫెక్షన్ లతో పోరాటం చేస్తుంది.

పాలు
పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది.

జ్వరం వచ్చినప్పుడు లేచి తిరగటానికి కావలసిన స్టామినాను క్యాల్షియం ఇస్తుంది.అందువల్ల కాచి చల్లార్చిన పాలను త్రాగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube