మనం రోజువారి తీసుకున్న కేలరీలు వాటిని బర్న్ చేసే దానిపైనే మన బరువు ఆధారపడి ఉంటుంది.తీసుకున్న క్యాలరీలను జీర్ణం చేయగలిగితే బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం చక్కెర, తీపి పానీయాలు తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరానికి అందుతాయి.వాటి స్థానంలో నీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి సున్నా క్యాలరీలు చేరుతాయి.
ఇలాంటి సరళమైన జీవనశైలి మార్పులు కనుక చేస్తే ఆరు నెలల్లో శరీర బరువు రెండు శాతం వరకు తగ్గవచ్చు.

ఒకరోజు లేదా వారం వ్యవధిలో శరీర బరువును తగ్గాలన్న ఆకాంక్షతో అవసరమైనన్ని కేలరీలు తీసుకోకుండా మానుకోవడం వల్ల కేలరీల లోటు ఏర్పడుతుంది.ఈ కేలరీల లోటు బరువు తగ్గడానికి కూడా దారి తీస్తుంది.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు కేలరీలను తగ్గించుకోవాల్సి ఉంటుంది.
మన జీర్ణ వ్యవస్థ జీర్ణం చేసిన దానికంటే తక్కువ క్యాలరీలు ఉపయోగించడం ఉపయోగించినప్పుడు కేలరీల లోటు ఏర్పడవచ్చు.

ప్రతిరోజు మనం తీసుకునే కేలరీలు మూడు విధాలుగా జీర్ణం అవుతాయి.మనం విశ్రాంతి తీసుకునే సమయంలో రక్త ప్రసరణ కోసం కొద్ది మోతాదులో జీర్ణం అవుతూ ఉంటాయి.ఆహారాన్ని జీర్ణం చేసేటప్పుడు శరీరం కేలరీలను ఖర్చు చేస్తుంది.
వ్యాయామ సంబంధిత కార్యాలయాలు వంటి క్రీడల సమయంలో కూడా కొన్ని కాలరీలు ఖర్చు అవుతాయి.తక్కువ కెరరీలు తినడానికి కొన్ని సాధారణ నియమాలను అనుసరించడం ఎంతో మంచిది.
ముఖ్యంగా చక్కర పానీయాలు తాగడం, చక్కెరను తీసుకోవడం తగ్గించడం ఎంతో మంచిది.ప్రాసెస్డ్ ఫుడ్స్ ను అస్సలు తీసుకోకూడదు.
ప్రాసెస్ చేసిన ఆహారలు తినడం దాన్యాలు, మాంసాలు చాలా ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి.వాటిని పూర్తిగా దూరంగా పెట్టడమే మంచిది.
సాధ్యమైనంత వరకు బయట ఆహారాన్ని తీసుకోకుండా ఇంటి ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిది.ఎందుకంటే ఇది కేలరీలు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.