మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.ఎటువంటి శుభకార్యాలు జరిగినా మొదటగా దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడం, మన సాంప్రదాయాలలో ఒక భాగంగా వస్తుంది.
ఇలా దీపం వెలిగించడం వెనుక ఎంతో అర్థం, పరమార్థం దాగిఉంది.అయితే దీపం వెలిగించిన తరువాత పంచభూతాలు కలుస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
అందుకే దీపం పంచభూతాల కలయిక అని అంటారు.
దీపం తయారుచేయడానికి అవసరమైన మట్టి మనకి భూమి నుంచి లభిస్తుంది కాబట్టి, దీపాన్ని భూమి గాను, నూనేను నీరుగా, దీపం వెలుగు అగ్నిగా, దీపం వెలగడానికి కావలసిన ఆక్సిజన్ గాలి నుంచి లభిస్తుంది కాబట్టి, పంచభూతాలలో గాలి కూడా ఒకటే.
వెలుగుతున్న దీపం కాంతిని ఆకాశంలోకి ప్రసరింపజేస్తుంది.కావున ఈ విధంగా పంచభూతాలన్ని ఈ దీపంలో కలుస్తాయి కనుక, దీపం పంచభూతాల కలయిక అని వేద పండితులు తెలుపుతున్నారు.
దీపం వెలిగించి పంచభూతాలతో పాటు, నవ గ్రహాల కలయిక వల్ల మనకు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భావిస్తారు.దీపపు వెలుగులో పంచభూతాలు మాత్రమే కాకుండా, నవగ్రహాల కలయిక అని కూడా భావిస్తారు.
దీపపు ప్రమిదను సూర్యుని గా, అందులో ఉన్న నూనెను చంద్రుని అంశంగా భావిస్తారు.వెలిగే దీపపు జ్వాలను కుజుడుగా, వెలిగే జ్వాలలో ఉన్న పసుపు రంగును గురుడుగా కొలుస్తారు.
అంతే కాకుండా దీపం వెలుగుతూ పడే నీడను రాహువు అని, దీపం నుంచి వెలువడే కాంతి కిరణాలను శుక్రుడుగా, దీపం వెలిగించడం వల్ల మనం పొందే మోక్షమే కేతువు అని పండితులు తెలియజేస్తారు.అయితే చివరగా దీపం కొండెక్కిన తర్వాత నల్లగా మారుతుంది దానిని శనిగా భావిస్తారు.
ఇలా పంచభూతాలు, నవగ్రహాల కలయిక ద్వారా వెలిగించే దీపం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని, శుభం కలుగుతుంది.కాబట్టి మనం ఏదైనా శుభకార్యం నిర్వహించేటప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా శుభకార్యం నిర్విఘ్నంగా సాగాలని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు.