హిందూ సంప్రదాయాలలో యజ్ఞాలకు, యాగాలకు, హోమాలకు ప్రత్యేక స్థానం ఉంది.అనేక శుభకార్యాలలో వీటిని నిర్వహిస్తూ ఉంటారు.
ఇందులో భాగంగానే హవానాగ్ని జ్వాలిస్తారు.ఇంకా చెప్పాలంటే గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు లాంటి శుభకార్యా సమయాలలో అగ్నిహోత్రాలు హవనాలు చేస్తూనే ఉంటారు.
ఇలాంటి సమయాలలో వాడిన ప్రతి వస్తువు కూడా ఎంతో పవిత్రమైనది.ఎంతో పాజిటివ్ ఎనర్జీ( Positive energy )ని ఆ సమయంలో వాడిన వస్తువులు కలిగి ఉంటాయి.
హవనం తర్వాత ఆ ప్రాంతమంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది.అక్కడ గాలిలో కూడా ఒక రకమైన సుగంధం ఆవరించి ఎంతో పవిత్రంగా ఉంటుంది.

హవనం ( Havanam ) జరిగిన ప్రాంతం ఎంతో పాజిటివిటీగా ఉంటుంది.మరి హవన భస్మం జరిగిన తర్వాత మిగిలిపోయిన వస్తువులను ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మామూలుగా అందరూ దాన్ని నదులు, సముద్రాలు వంటి ప్రవహించే నీటిలో వదులుతూ ఉంటారు.అలా వదలడం వల్ల అంతా పవిత్రమైన హవానా భస్మం వృధా అయిపోతుందని వేద పండితులు చెబుతున్నారు.
యజ్ఞాలు, హోమాల సమయంలో హవనాలు చేస్తూ ఉంటారు.హవనం తర్వాత మిగిలిపోయిన బూడిద లేదా విభూదిని పనికి రానిదిగా చాలా మంది తెలియని వారు భావిస్తూ ఉంటారు.
కానీ అది పనికి రానిది కాదు దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

ఇవి తెలుసుకొని హవానా బస్వాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.చాలా శుభకార్యాలలో హవనం చేస్తూ ఉంటారు.హవనం జరపడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయితుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అంతేకాకుండా కొత్త ఇళ్లలో చేరేటప్పుడు కూడా దీన్ని చేయడం వల్ల ఇల్లు శుద్ధి అవుతుందని వారి గట్టి నమ్మకం.ఈ హవన కుండలో అన్ని రకాల ముఖ్యమైన పూజా సామాగ్రిని ఉపయోగిస్తారు.
ఈ తంతు పూర్తయిన తర్వాత మిగిలిన విభూదిని ప్రవహించే నీటిలో వదిలేస్తారు.హవనం చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా హవనం చేసే అగ్ని వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతుంది.తర్వాత మిగిలిన బూడిదను ఇంటి పరిసరాలలో, వ్యాపార స్థలాలలో చల్లితే దిష్టి దూరమవుతుంది.