సాయిబాబా అనుగ్రహం పొందాలంటే ఇవి పఠించాల్సిందే..!

గురువారం అనగానే గుర్తొచ్చే దేవుడు సాయిబాబా.ఆ రోజు షిర్డీ సాయిబాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల నమ్మకం.అందుకే చాలా మంది ప్రతీ గురువారం బాబాకు ప్రత్యేక పూజలు చేస్తూ… ఉపవాసాలుంటారు.అంతేకాకుండా సాయిబాబా అష్టకాన్ని లేదా సాయిబాబా ఏకాదశ సూత్రాలను పఠిస్తే… ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా మనం కోరిన కోరికలతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరుతుందంటారు.

 Sai Baba Ekadasha Sutralu And Sai Baba Ashtakam Detials, Sai Baba Ashtakam, Sai-TeluguStop.com

శ్రీ సాయిబాబా అష్టకం.

పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం 1

మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం 2

జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం 3

సాక్షాత్‌ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్‌ ముఖాత్‌ నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం 4

Telugu Baba, Devotional, Sai Baba, Saibaba, Sai Baba Pooja, Saibabaekadasha, Shi

యస్య తర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం 5

నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః భవబంధాన హర్తారం సాయినాథం నమామితాం 6

ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి కరుణసాగరం దేవం సాయినాథం నమామితం 7

సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం 8

సాయిబాబా ఏకాదశ సూత్రాలు.

Telugu Baba, Devotional, Sai Baba, Saibaba, Sai Baba Pooja, Saibabaekadasha, Shi

షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.ఈ భౌతిక దేహానంతరము సైతం నేనప్రమత్తుడను.నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడును.నా సమాధినుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.నా సమాధినుండియే నా మానుష్య శరీరము మాట్లాడును.

నన్నాశ్రయించిన వారిని, నన్ను శరణు జొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యము.నాయందెవరికి ద్రుష్టిగలదో వారి యందే నా కటాక్షము గలదు.

మీ భారములను నాపై బడవేయుడు.నేను మోసెదను.

నా సహాయమును కానీ, నా సలహానుగాని, కోరిన తక్షణమే నొసంగ సంసిద్ధుడను.నా భక్తుల ఇంట ‘లేమి’ అను శబ్దము పొడచూపదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube