తెలంగాణలో పెండింగ్ చలాన్లపై పోలీసులు మరోసారి ఫోకస్ పెట్టారు.ఈ మేరకు చలాన్లపై రాయితీ ఇవ్వనున్నారు.
గతంలో ఇదే తరహాలో రాయితీ అవకాశం కల్పించడంతో చాలా మంది వాహనదారులు సద్వినియోగం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మరోసారి వాహనదారులకు రాయితీ ఛాన్స్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారని తెలుస్తోంది.
ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వనున్నారని సమాచారం.రాష్ట్రంలో పెండింగ్ చలాన్లు భారీగా ఉండిపోవడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.అయితే గతంలో చలాన్లపై రాయితీ ప్రకటించడంతో వాహనదారులు రికార్డ్ స్థాయిలో రూ.300 కోట్ల వరకు జరిమానాలు కట్టిన సంగతి తెలిసిందే.