నట్స్ జాబితాలో జీడిపప్పు( Cashew ) ఒకటి.చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు తినడానికి కూడా జీడిపప్పు ఎంతో రుచికరంగా ఉంటుంది.
వంటల్లో జీడిపప్పును విరివిరిగా వాడుతుంటారు.స్వీట్స్ లోనే కాకుండా కూరలు, బిర్యానీ వంటి ఆహారాల్లో కూడా జీడిపప్పును చేరుస్తారు.
జీడిపప్పులో వివిధ రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ వంటివి మెండుగా ఉంటాయి.అందువల్ల ఆరోగ్యానికి జీడిపప్పు ఎంతో మేలు చేస్తుంది.
అయినప్పటికీ కొందరు మాత్రం జీడిపప్పును తినకపోవడమే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.మరి ఆ కొందరు ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో చాలామంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారు.అలాంటివారు జీడిపప్పుకు దూరంగా ఉండటమే మంచిది.ఎందుకంటే జీడిపప్పులో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటాయి.ఇవి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.జీడిపప్పులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.ఈ కొవ్వు ఆమ్లాలు ఎవరైతే గుండె సంబంధిత సమస్యలతో( Heart problems ) బాధపడుతున్నారో వారికి మంచివి కావు.
కాబట్టి వారు జీడిపప్పును తీసుకోకపోవడం ఉత్తమం.

మధుమేహం( Diabetes ) ఉన్నవారు కార్బోహైడ్రేట్స్ వీలైనంత తక్కువగా తీసుకోవాలి.అయితే కార్బోహైడ్రేట్స్ జీడిపప్పులో అధికంగా ఉంటాయి.అందువల్ల మధుమేహులు జీడిపప్పును చాలా మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్టమక్ అల్సర్ ఉన్నవారు జీడిపప్పు తినకపోవడమే మంచిది.జీడిపప్పులో ఉండే ఫైబర్ కంటెంట్ అల్సర్ సమస్యను మరింత పెంచుతుంది.
జీడిపప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి.ఓవర్ వెయిట్ తో ఇబ్బంది పడుతున్న వారు జీడిపప్పు తింటే మరింత బరువు పెరుగుతారు.
కాబట్టి జీడిపప్పును వీలైనంతవరకు తక్కువగా తీసుకోండి.జీడిపప్పును నేరుగా కాకుండా కొంతమంది ఫ్రై చేసుకుని ఉప్పు కారం చల్లుకుని తింటారు.
అలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది .మధుమేహం వచ్చే రిస్క్ రెట్టింపు అవుతుంది.కాబట్టి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ జీడిపప్పుతో జర జాగ్రత్తగా ఉండండి.అతిగా తీసుకుంటే అదే జీడిపప్పు మీకు అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.