ఇలా నిద్ర‌పోతే బ‌రువు త‌గ్గుతార‌ట‌..తెలుసా?

నేటి ఆధునిక కాలంలో క‌ఠినమైన డైట్లు ఫాలో అవుతూ.చెమ‌టలు చిందిలా వ‌ర్క‌వుట్స్ చేస్తూ.

ఒంట్లో పెరిగిన కొవ్వును క‌రిగించు కునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారు కోట్ల‌లో ఉన్నారు.బ‌రువు త‌గ్గ‌డం అనేది ఆహారం, వ్యాయామం.

ఈ రెండిటిపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చాలా మంది భావిస్తుంటారు.కానీ, ఇలా అనుకోవ‌డం చాలా పొర‌పాటు.

నిజానికి నిద్ర కూడా బ‌రువును ప్ర‌భావితం చేస్తుంది.బ‌రువు, నిద్ర‌కు సంబంధం ఏంటీ.? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది.ఆగండి.

Advertisement

ఆగండి.అక్క‌డే వ‌స్తున్నా.

నిద్రిస్తున్న‌ప్పుడు మ‌న శ‌రీరంలో లెప్టిన్, గ్రెలిన్ అనే రెండు హార్మోన్లు ప్రభావితం అవుతాయి.గ్రెలిన్ ఆకలిని పెంచితే.

లెప్టిన్ ఆకలిని తగ్గిస్తుంది.త‌క్కువ స‌మ‌యం పాటు నిద్రించే వారికి గ్రెలిన్ ప్రభావం అధికంగా ఉంటుంది.

దాంతో ఆక‌లి పెరిగి.ఏది ప‌డితే అది లాగించేస్తారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఫ‌లితంగా శ‌రీరంలో ఫ్యాట్ పెరిగి పోయి వెయిట్ గెయిన్ అవుతారు.అదే ఎక్కువ స‌మ‌యం పాటు నిద్రించే వారికి లెప్టిన్ ప్రభావం అధికంగా ఉంటుంది.

Advertisement

దాంతో ఆక‌లి త‌గ్గి.ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు.

ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.అంతే కాదు, నిద్ర పోయేట‌ప్పుడు శ‌రీరం వేడిగా మారుతుంది.

ఆ వేడి వ‌ల్ల ఒంట్లో పేరుకుపోయిన అద‌న‌పు కొవ్వు క‌రుగుతుంది.అందు వ‌ల్ల, మీరు మీ బరువును తగ్గించుకోవాలని భావిస్తుంటే క‌నుక‌.

ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రను నిర్ల‌క్ష్యం చేయ కూడదు.

మంచి ఫుడ్ తిన‌డం, వ‌ర్క‌వుట్స్ చేయ‌డంతో పాటు.ఖ‌చ్చితంగా రోజుకు ఎనిమిది గంట‌ల పాటు ప‌డుకోవాలి.ఇలా నిద్ర‌పోతేనే బ‌రువు త‌గ్గుతార‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అదే బ‌రువు పెర‌గాల‌ని అనుకునే వారు.రోజుకు ఐదు, ఆరు గంటలు నిద్రిస్తూ.

కేల‌రీలు అధికంగా ఉంటే ఫుడ్ తీసుకోవాలి.ఇలా చేస్తే బ‌రువు పెరుగుతారు.

తాజా వార్తలు