చాలామంది యువత ఎదుర్కొనే ప్రధానమైన సమస్యల్లో కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ( Dark circles )రావడం కూడా ఒక పెద్ద సమస్య.ఈ నల్లటి వలయాల వల్ల వారి ముఖ అందమే పాడైపోతుంది.
అయితే డార్క్ సర్కిల్స్ సరిగా నిద్రపోని వారికి, డెస్క్ జాబ్స్ చేసేవారికి, అలర్జీలు ఉన్నవారికి, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నవారికి, చర్మ సమస్యలు ఉన్నవారికి, ఐరన్ తక్కువగా ఉన్నవారికి ఇలా కొన్ని సమస్యల వల్ల ఈ డార్క్ సర్కిల్స్ వస్తాయి.అంతేకాకుండా థైరాయిడ్( Thyroid ) ఉన్న, నీళ్లు సరిగ్గా తాగకపోయినా కూడా ఈ సమస్య వేధిస్తుంది.
అయితే ఈ నల్లటి వలయాలను వదిలించుకోవడానికి చాలా టిప్స్ పాటించాలని అంటున్నారు వైద్య నిపుణులు.

అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.శరీరంలో ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగాలంటే ఐరన్( Iron ) సరిపడినంత కావాలి.అయితే ఆకుకూరల్లో సరిపడినంత ఐరన్ ఉంటుంది.
ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర( Lettuce, Spinach ) లాంటి ఆకుకూరల్లో ఐరన్ మెండుగా ఉంటుంది.ఇలా కళ్ల చుట్టు డార్క్ సర్కిల్స్ ఉన్నవారు ఆకుకూరలని తప్పకుండా తీసుకోవాలి.
చర్మాన్ని చక్కగా ఉంచడంలో విటమిన్ ఈ బాగా సహాయపడుతుంది.అలాగే కళ్ళ కింద నలుపుని తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
విటమిన్ ఈ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

అలాంటి ఆహారాలు తీసుకోవడం వలన చర్మానికి కావాల్సిన పోషణా లభించి చర్మం మంచిగా కనిపిస్తుంది.మనిషి ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది.కాబట్టి ప్రతిరోజు 8 గంటలపాటు నిద్ర కచ్చితంగా శరీరానికి అవసరం.
అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు( Health problems ) రావు.అంతేకాకుండా చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది.
గుమ్మడి గింజలు, బాదం, అవకాడో, వేరుశనగ గింజలు, బంగాళదుంప, క్యాబేజ్, బ్రోకలీ లాంటి వాటిని ఆహారంలో తీసుకుంటే చర్మం బాగుంటుంది.దీని వలన ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే నయమవుతాయి.
అలాగే నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.అప్పుడే శరీర ఆరోగ్యం తో పాటు చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.