కొంత మందికి ముఖం తెల్లగా మృదువుగా మెరిసిపోతూ ఉంటుంది.కానీ మెడ మాత్రం నల్లగా అందవిహీనంగా తయారవుతుంటుంది.
మెడ నల్లగా మారడానికి కారణాలు అనేకం.ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్( Dead skin cells ) పేరుకుపోవడం, హార్మోన్ చేంజ్, శరీరంలో అధిక వేడి, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.
దీంతో మెడ నలుపును వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.కొందరు బ్యూటీ పార్లర్ లో మెడ నలుపును తొలగించుకోవడం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పది నిమిషాల్లో మెడ నలుపును వదిలించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood powder ), హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ( turmaric )వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ పీల్ పౌడర్ మరియు సరిపడా పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చక్కని తీసుకుని మెడను బాగా రుద్దాలి.ఐదు నిమిషాల పాటు నిమ్మ చెక్కతో మెడను రబ్ చేసి.
అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటిస్తే మెడ నలుపు దెబ్బకు మాయం అవుతుంది.
మునుపట్ల మళ్లీ మీ మెడ తెల్లగా మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది.మెడ ఇంకా నల్లగా కనుక ఉంటే ఈ రెమెడీని రెండు మూడు సార్లు ప్రయత్నించండి.పూర్తిగా నలుపు వదిలిపోతుంది.మీ మెడ మల్లెపువ్వు మాదిరి మెరుస్తుంది.అలాగే చేతులు నలుపు, పాదాల నలుపును తొలగించడానికి కూడా ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది.