అల్లం ఘాటుగా ఉన్న కూడా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది.ఆరోగ్యపరంగా అల్లం ( Ginger )అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
వివిధ జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.అంతే కాదండోయ్ అందాన్ని పెంచే సత్తా కూడా అల్లానికి ఉంది.
అసలు చర్మానికి అల్లాన్ని ఎలా ఉపయోగించాలి.? అల్లం వల్ల ఎటువంటి స్కిన్ కేర్ బెనిఫిట్స్ పొందవచ్చు.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పొడి మనకు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది.లేదా అల్లాన్ని ఎండబెట్టి మెత్తని పౌడర్ లా చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు.ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) మరియు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు వే( Curd )సుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళల్లోకి పోకుండా చాలా జాగ్రత్తగా ముఖానికి అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే.అల్లంలోని సహజ నూనెలైన జింజెరోల్స్ చికాకు తో కూడిన చర్మాన్ని శాంత పరుస్తాయి.అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి యూవీ కిరణాలు, కాలుష్యం, ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి.మరియు అల్లం నిస్తేజమైన చర్మాన్ని పునరుద్ధరించడానికి మరియు డార్క్ స్పాట్స్ దూరం చేయడానికి తోడ్పతాయి.
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేస్తాయి.
అలాగే చర్మానికి అల్లాన్ని మరొక విధంగా కూడా ఉపయోగించవచ్చు.అందుకోసం ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
పది నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగ్గుతాయి.
పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.సాగిన చర్మం టైట్ గా మారుతుంది.
మొటిమల సమస్య తగ్గుతుంది.స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.
మరియు చర్మం డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది.