ఆరోగ్యానికి అండగా నిలిచే గుమ్మడిని రోజు మార్నింగ్ ఇలా తీసుకుంటే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి!

గుమ్మడి.దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.గుమ్మడి లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అవి మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.కానీ కొందరికి గుమ్మడిని కూర రూపంలో తీసుకోవడం ఇష్టం ఉండదు.అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే విధంగా గుమ్మడి( pumpkin ) తో స్మూతీని తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయం తీసుకుంటే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.

 Best Way To Consume Pumpkin For Good Health! Pumpkin, Pumpkin Smoothie, Pumpkin-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యానికి అండగా నిలిచే గుమ్మడితో స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మరియు అది అందించే ఆరోగ్య లాభాలు ఏంటి అన్నది తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పై తొక్క మరియు లోపల ఉండే గింజలను తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ ప్యూరీ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ ప్యూరీని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు గుమ్మడి ప్యూరీ వేసుకోవాలి.

Telugu Tips, Latest, Pumpkin, Pumpkinsmoothie-Telugu Health

అలాగే ఒక అరటి పండు( Banana ), వన్ టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్( Peanut butter ), పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడు జాజికాయ పొడి( Nutmeg powder ), చిటికెడు అల్లం పొడి వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాసు బాదం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తే మన గుమ్మడి స్మూతీ సిద్ధం అయినట్టే.ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ కు చాలా మేలు చేస్తుంది.

Telugu Tips, Latest, Pumpkin, Pumpkinsmoothie-Telugu Health

రెగ్యులర్ డైట్ లో ఈ స్మూతీ ఉంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.ఎముకలు దంతాలు దృఢంగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకునే శక్తి కూడా ఈ స్మూతీకి ఉంది.ఈ స్మూతీ చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.మరియు ఈ స్మూతీ వెయిట్ లాస్ కు సైతం సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube