అరటి చెట్టు ఇంటి పెరట్లో ఉంటే అన్ని లాభాల...

ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన దేశస్థులు ఇంట్లో ఇలాంటి మొక్కలు నాటితే శుభాలు జరుగుతాయని రకరకాల మొక్కలను తెచ్చి ఇంట్లో నాటుతూ ఉంటారు.కొంతమంది పూల చెట్లను, తులసి మొక్కలను చిన్న చిన్న కుండీలలో తెచ్చి ఇంటి పై భాగంలో పెంచుతూ ఉంటారు.

 If A Banana Tree Is In The Backyard, All The Benefits, Banana Tree, House , De-TeluguStop.com

మరి కొంతమంది ఇంటి పెరట్లో రకరకాల మొక్కల ను పెంచడంతో పాటు ఆ మొక్కలను ఎంతో జాగ్రత్త గా చూసుకుంటూ ఉంటారు.

అలాగే మన ఇంటి పెరట్లో అరటి చెట్టును పెంచడం వల్ల ఆ ఇంటికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ప్రజల నమ్మకం.

ఇంటి ఆవరణలో అరటి చెట్టు లేదా మొక్కను నాటడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.అరటి చెట్టు ఎక్కడ ఉందో, అక్కడ విష్ణువు,లక్ష్మి కొలువై వుంటారని చాలామంది నమ్మకం.

ఇంట్లో అరటి మొక్కను నాటడం ద్వారా గురు గ్రహం యొక్క శుభ ఫలితాలు పొందవచ్చని అంటారు జ్యోతిష్యులు.ఈ చెట్టును ఎక్కడ నాటినా ఆ ఇంట్లో వారంతా సుఖసంతోషాలతో ఉంటారు.

పెళ్లికాని అమ్మాయిలకు త్వరలో పెళ్లి అవుతుందని చాలామంది ప్రజల విశ్వాసం.ఈ చెట్టును ఎక్కడ నాటితే ఆ ఇంట్లో పిల్లలు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు.

Telugu Astrology, Banana Tree, Benefits, Devotional, Vastu Tips-Latest News - Te

ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఏ కష్టాలైనా దూరమైపోతయి.ఉన్నత విద్య,జ్ఞానాన్ని పొందడంలో అరటి చెట్టు సహాయ పడుతుంది.ఎందుకంటే శాంతియుత సానుకూల శక్తి దాని ఆవరణలో బయటకు వస్తూ ఉంటుంది.అరటి చెట్టు కు నీళ్ళు పోసి పూజించడం వల్ల చాల ఐశ్వర్యం కలుగుతుంది.అరటి చెట్టుకు విత్తనాలు లేవు.అరటి మొక్కను నాటితేనే అరటి చెట్టు పెరుగుతుంది.

కాబట్టి అరటి పండ్ల ను దేవతలకు పూజ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube