ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.02
సూర్యాస్తమయం: సాయంత్రం.6.39
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11
మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.
వృషభం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులు మీ సొమ్ము ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీ ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.
కర్కాటకం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది.
సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.
కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని వృథా చేయకూడదు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాల చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.అది మీ మనసు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
మకరం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుంభం:

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపడి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.అనవసరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం:

మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
ఇతరుల మాటలకు అసలు మోసపోకండి.దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
.