ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ప్రజలు ఎక్కువగా అధిక కొలెస్ట్రాల్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.మన శరీరంలో ఉండవలసిన కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు అది మన శరీర ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు.
కొలెస్ట్రాల్ సాధారణంగా మన శరీరంలో కచ్చితంగా ఉంటుంది.కొలెస్ట్రాల్ లేకుండా మనం బ్రతకడం కూడా కష్టమే అని వైద్యులు చెబుతూ ఉంటారు.
అయితే ఆ కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి ఎలా ప్రమాదం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది.
కాబట్టి ఈ కొలెస్ట్రాల్ ను ఎంత త్వరగా తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది.ఈ రోజుల్లో మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అయ్యే ఆహార పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాసెస్ చేసిన ఆహారాలు కొవ్వును కరిగించే ఆహారంలో మొదటి స్థానంలో ఉన్నాయి.మీ క్యాలరీలను పెంచడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రైస్ మొదలైనవి కొవ్వును అధికంగా పెరగడానికి సహాయపడతాయి.

ప్రాసెస్డ్ బేకింగ్ ఫుడ్స్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.చిప్స్ వంటి ప్యాక్ చేసిన స్నాక్స్‌లో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుంది.అవి తరచుగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారు చేస్తారు కాబట్టి వీటిలో అధిక కొవ్వు ఉంటుంది.
అవి మీ రక్తంలో వాపును పెంచే ట్రైగ్లిజరైడ్స్‌ను కూడా పెరిగేలా చేస్తాయి.ప్రాసెస్ చేసిన మాంసాలలో సంతృప్త కొవ్వు ,సోడియం అధికంగా ఉండడం వల్ల కొవ్వు అధికంగా ఉంటుంది.
న్యూట్రిషన్, మెటబాలిజం, కార్డియోవాస్కులర్ డిసీజెస్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రాసెస్ చేసిన ఆహారాలను నిరంతరం తీసుకోవడం వల్ల కొవ్వు అధికంగా పెరిగే అవకాశం ఉంది.నిరంతర ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం జరుగుతుంది.
అతిగా మద్యం సేవించడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.







