తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 25, ఆదివారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.08

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 25 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.09

రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఎప్పటినుండో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో ఈరోజు మీరు పూర్తి చేస్తారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

వృషభం:

ఈరోజు మీరు చేసే వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీ కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వలన కుటుంబ సభ్యులు మనసి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు వ్యవసాయదారులకు ఎప్పటినుండో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకపోవడం మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటాయి.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ఇరుగు పొరుగు వారితో వాదనకు దిగే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.

మకరం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.అనుకోకుండా ఈరోజు బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు.

అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

కుంభం:

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

మీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టడమే మంచిది.దగ్గర్లో ఉన్న వైద్యం సంప్రదించాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube