రాజ్ తరుణ్ లావణ్య (Raj Tarun ,Lavanya)వ్యవహారం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే.రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది.
లావణ్య (Lavanya)ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి (Mastan Sai)అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలో ఒక కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి(Mastan Sai) తన ప్రైవేట్ వీడియోతో పాటు కొంతమంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడని ఆమె చెప్పుకొచ్చారు.
మస్తాన్ సాయి కొంతమంది సెలబ్రిటీల ఫోన్లను సైతం హ్యాక్ చేశాడని ఆమె పేర్కొన్నారు.తాను రాజ్ తరుణ్ విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య వెల్లడించారు.పోలీసులు మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్(Hard disk) ను సీజ్ చేశారని ఈ హార్డ్ డిస్క్ లో ఏకంగా 200 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని సమాచారం అందుతోంది.లావణ్య ఫిర్యాదుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

మస్తాన్ సాయి లావణ్యకు (Mastan Sai Lavanya)సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోలను రికార్డ్ చేశాడని తెలుస్తోంది.మరోవైపు ఈ వివాదం ఎఫెక్ట్ రాజ్ తరుణ్ కెరీర్ పై కూడా పడింది.గతంతో పోల్చి చూస్తే రాజ్ తరుణ్ కు మూవీ ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.రాబోయే రోజుల్లో రాజ్ తరుణ్ కెరీర్ పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది.రాజ్ తరుణ్ సినిమాలు గతేడాది విడుదలై భారీ నష్టాలను మిగిల్చాయి.

రాజ్ తరుణ్ సైతం పలు ఇంటర్వ్యూలలో ఈ వివాదాల గురించి స్పందించి తన వంతు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యే వరుస విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.గతంతో పోల్చి చూస్తే రాజ్ తరుణ్ మార్కెట్ ఊహించని స్థాయిలో తగ్గిందనే చెప్పాలి.