సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో వేసుకునే బట్టల దగ్గర నుంచి తీసుకునే ఆహారం వరకు ఇలా అన్ని విషయాల్లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే, ఏ విషయంలో పొరపాటు చేసినా.
కడుపులో బిడ్డపై ప్రభావం పడుతుంది.అందుకే పెద్దలు, వైద్యులు గర్భవతులకు తరచూ జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.
ఇదిలా ఉంటే.కొన్ని కొన్ని ఆహారాలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో మేలు చేస్తాయి.
అలాంటి వాటిలో మెక్కజొన్న ఒకటి.అయితే కొందరు మహిళలు గర్భం దాల్చినప్పుడు మొక్కజొన్న తినేందుకు భయపడుతుంది.
మొక్కజొన్న తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుందని నమ్మడమే అందుకు కారణం.కానీ, ప్రెగ్నెన్సీ సమయంలో మొక్క జొన్న తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
సాధారణంగా గర్భవతుల్లో రక్త హీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.అయితే ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే మొక్క జొన్నను ప్రెగ్నెన్సీ మహిళలు డైట్‌లో చేర్చుకుంటే.
రక్త హీనత సమస్య దూరం అవుతుంది.
అలాగే గర్భం దాల్చిన మహిళలు అత్యధికంగా ఎదుర్కొనే సమస్యల్లో మలబద్ధకం ఒకటి.అయితే మొక్క జొన్నను తగిన మోతాదులో తరచూ తీసుకోవడం వల్ల.అందులో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను సులభంగా నివారిస్తుంది.
ఒక కొందరు శిశువులు పుట్టుకతోనే కొన్ని లోపాలతో పుడతారు.
అయితే జిక్సాన్‌తిన్, పాథోజెనిక్ యాసిడ్‌తో పాటు మరెన్నో పోషక విలువలు ఉండే మొక్క జొన్న తీసుకుంటే.
శిశువుకు పుట్టుకతో వచ్చే లోపాలను నివారించవచ్చు.అలాగే చాలా మంది ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం బారిన పడుతుంటారు.
కానీ, మొక్క జొన్నను డైట్‌లో చేర్చుకుంటే.రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉంటాయి.
దాంతో మధుమేహం వచ్చే రిస్క్ కూడా తగ్గుముఖం పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని.మొక్క జొన్నలను ఎక్కువగా తీసుకుంటే ఇతర సమస్యలు వస్తాయి.