సోషల్ మీడియాలో నిన్న మొన్న ఒక వార్త దంచి కొడుతుంది.అదేంటంటే త్రివిక్రమ్ అయన భార్య కు ఒక కారు గిఫ్ట్ గా కొనిచ్చారు అని.
ఈ వార్తను పట్టుకొని చాల మంది చాల రకాల వార్తలను వడ్డించేసారు.భార్యకు బిఎండబ్ల్యూ కారు కొనివ్వడం అంటే ఎదో దేశాన్ని ఉద్దరించునట్టు వార్తలు పుట్టుకచ్చాయి.
సరే ఆ వార్త, ఆ వంకాయ కాసేపు పక్కన పెడితే చాల మందికి త్రివిక్రమ్ భార్య గురించి పెద్దగా తెలియదు.ఆమె చాల లౌ ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంది.
స్వతహాగా ఒక డ్యాన్సర్ అని మాత్రం ఆ మధ్య ఒక స్టేజి ప్రదర్శన ఇచ్చిన తర్వాత అందరికి తెలిసింది.అయితే ఆమెకు సంబందించిన కొన్ని విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య.ఆమె ఒక నర్తకి .సిరివెన్నెల సీతారామ శాస్రి గారి మేన కోడలు.పెద్దలు కుదిర్చిన వివాహమే.
ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫార్చున్ ఫోర్ సినిమాస్ కి సంబందించిన అన్ని బాధ్యతలను కూడా దగ్గరుండి చూసుకుంటుంది.
అంతే కాదు ఈ బ్యానర్ ఒక వైపు హారిక ఆండ్ హాసిని వారితోను మరోవైపు సితార బ్యానర్స్ తోను కలిసి పని చేస్తుంది.డీజే టిల్లు కి కూడా సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ బ్యానేర్ చల్ మోహన్ రంగా చిత్రానికి కూడా కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు .ఇన్ని వ్యవహారాలను చూసుకుంటున్న కూడా ఎక్కడ సౌజన్య పేరు బయటకు రాకుండా చూసుకుంటున్న ఈ బిఎండబ్ల్యు కారు పుణ్యమా అని అందరు చాలానే మాట్లాడుకుంటున్నారు.మరి భర్తకు భార్యే కదా ఒక వెన్నముఖ ఏమాత్రం కారు కొంటె ఈ మాత్రం న్యూస్ ఉండాల్సిందే అంటే ఎలా చెప్పండి.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో సినిమా తో ఫుల్ బిజీ గా ఉన్నాడు.ఓ వైపు ప్రొడక్షన్ హౌస్, మరో వైపు దర్శకత్వం.ఇవి కాకుండా సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా.ఇమ్మో దారుల్లో డబ్బులు వస్తుంటే కోటి రూపాయలు పెట్టి కారు కొనివ్వడం వింతేముంది.సరే కొన్నారు అనుకోండి మీడియా కి కవర్ చేయడానికి ఇంత కన్నా మంచి న్యూస్ లు లేవా? సోషల్ మీడియా , యూట్యూబ్ లు ఎదో చెప్తున్నాయి అనుకుంటే మెయిన్ మీడియా కూడా ఒక దర్శకుడు ఆయన భార్యకు కారు కొనిస్తే మెయిన్ వార్తల వేయాలా? ఎటు పోతుందో ఈ థర్డ్ ఎస్టేట్.అదేనండి సమాజానికి ఒక మూలస్థంభం గా ఉన్న మీడియా.