మలబద్ధకం. వయసుతో సంబంధం లేకుండా ఎందరినో కామన్‌గా వేధించే సమస్య ఇది.ఫైబర్ ఫుడ్ ఎక్కువగా లేదా తక్కువగా తీసుకోవడం, ఒకే చోట గంటలు తరబడి కూర్చోవడం, శరీరానికి తగినంత శ్రమ లేక పోవడం, వేళకు ఆహారం తినక పోవడం, పాల ఉత్పత్తులను అధికంగా వినియోగించడం, పలు రకాల మందుల వాడకం, హార్మోన్ డిజార్డర్స్ వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటుంది.ఇది చిన్న సమస్యగానే అనిపించినా.
నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
అందుకే మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
ఏవేవో మందులు వాడుతుంటారు.అయితే ఈ సమస్యను నివారించడానికి మఖానా అద్భుతంగా సహాయపడుతుంది.
తామర గింజలనే మఖానా అంటారు.ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే మఖానాలో బోలెడన్ని పోషక విలువలు నిండి ఉంటాయి.
అందుకే ఇవి ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి.
ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్న వారు ప్రతి రోజు ఉదయాన్నే తేలిక పాటి నేతిలో వేయించిన మఖానాను ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

ఇలా చేస్తే గనుక జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారుతుంది.ఫలితంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.అదే సమయంలో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు సైతం దరి చేరకుండా ఉంటాయి.

పైగా పరగడుపున మఖానాను తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.బీపీ ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది.
కీళ్ల నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.మరియు దంతాలు సైతం గట్టిగా మారతాయి.
కాబట్టి, మలబద్ధకం ఉన్న వారు మాత్రమే కాదు ఎవ్వరైనా మఖానాను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.గర్భిణీలకు, పిల్లలకు కూడా మఖానా ఎంతో మేలు చేస్తుంది.







