ఇప్పుడు ఫుల్లు క్లారిటీ వచ్చేసింది.తన నైజాన్ని పొట్ట విప్పి.
చూపించేసింది బీజేపీ.ఎక్కడైనా తమదే పైచేయి అన్నట్టుగా కమల నాథులు కుండబద్దలు కొట్టేశారు.
ఇక, తిరుపతి ఉప ఎన్నికకుసంబంధించి ప్రచారానికి కూడా రెడీ అయిపోయారు.ఏం చేయాలి.
ఎలా ముందుకు వెళ్లాలి.తిరుపతిలో ఎలా సత్తా చాటాలి.
ఎవరెవరు ఏయే బాధ్యతలు తీసుకోవాలి.వంటి పలు విషయాలపై ఫుల్లు క్లారిటీకి వచ్చేశారు.
నిన్న మొన్నటి వరకు తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక విషయంలో సోము వీర్రాజు కేంద్రంగా సాగిన వివాదానికి పూర్తిగా తెరపడింది.
వాస్తవానికి నిన్న మొన్నటి వరకు కూడా సోము మాత్రమే.
తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జోరుగా ఉన్నారని.కేంద్రంలోని పెద్దలు ఇంకా నిర్ణయం తీసుకోలేదని అనుకున్నారు.
కానీ, దాదాపు కేంద్రంలోని పెద్దలు పూర్తి హామీ ఇచ్చిన తర్వాతే.సోము ఇక్కడ నోరు విప్పారనే విషయం తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది.
బీజేపీలో అత్యంత కీలకమైన కోర్ కమిటీ సమావేశం తాజాగా పురందేశ్వరి ఇంట్లో విశాఖలో జరిగింది.ఈ సమావేశానికి చిన్న చితకా నాయకులు కాదు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి మురళీధరన్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి హేమా హేమీలు హాజరయ్యారు.

తిరుపతి ఉప పోరుకు సంబంధించి బీజేపీనే పోటీ చేస్తున్నందున.ప్రతి మండలానికి ఒక బృందం పనిచేయాలని, కీలక వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని, ఎన్నిక పూర్తయ్యే వరకు అంతా అక్కడే ఉండాలని తీర్మానించారు.ఇదీ.తిరుపతి విషయంలో బీజేపీ క్లారిటీ! కట్ చేస్తే.ఇప్పుడు జనసేన పై ట్రోల్స్ పెరుగుతున్నాయి.
బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.తిరుపతి కోసం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా వదులుకుంది.
అయితే.అక్కడ పవన్ ఫ్రేమ్‌ను వాడుకున్న బీజేపీ.
ఇప్పుడు తిరుపతిలో మాత్రం యూటర్న్ తీసుకుంది.

తామే పోటీ చేసేందుకు రెడీ అంటూ.కొన్నాళ్లుగా ప్రచారం కూడా ముమ్మరం చేస్తోంది.తిరుపతి నియోజకవర్గంలో ఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది.
ఇంత జరిగినా.పవన్ మాత్రం తేలే వరకు అందరం మౌనంగా ఉందాం! అని అన్నారు.
ఇక, ఇప్పుడు.తేలిపోయింది.
బీజేపీనే ఇక్కడ నుంచి అభ్యర్థిని దింపడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ క్రమంలో ఇప్పుడు.
జనసేన ఎలా ముందుకు సాగుతుంది.
ఇప్పటి వరకు సోము వీర్రాజు వంటి వారు చెబితే.
కాదన్న పవన్.ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పేవారు కూడా తిరుపతిని విడిచి పెట్టకూడదంటూ.
ముందుకు సాగడం.జనసేనను పక్కన పెట్టినట్టే.
ఈ క్రమంలో ఇంకా సర్దుకు పోతాం.అంటూ.
పవన్ ప్రకటిస్తారా? లేక సంచలన నిర్ణయం ఏదైనా తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.మొత్తానికి ఈ పరిణామంపై సోషల్ మీడియాలో జనసేనను ఉక్కిరి బిక్కిరి చేస్తూ.
కామెంట్లు రావడం గమనార్హం.