ఖమ్మం నుంచే తుమ్మల  ... పొంగులేటి ఎక్కడో ... ? 

తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )లో సీట్ల పంచాయతీ ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు.చాలామంది సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తుండగా,  మరికొన్ని సీట్ల విషయం లో ఇంకా తర్జనభర్జన జరుగుతోంది.

 Sneezing From Khammam Ponguleti Somewhere , Ponguleti Srinivasareddy, Tummal-TeluguStop.com

దీనికి తోడు వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో వారికి సీట్ల కేటాయింపు అంశంపై కసరత్తు జరుగుతుంది.అందుకే అభ్యర్థుల జాబితా ప్రకటన మరింతగా ఆలస్యం అవుతుంది.

  ఇది ఇలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Tummala nageswararao )రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది .పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తుమ్మల మొదటి నుంచీ ఆశలు పెట్టుకున్నారు.అయితే ఖమ్మం మాజీ ఎంపీ,  ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti srinivasareddy )సైతం అదే పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో ఉండడంతో,  ఇద్దరు నేతలలో ఎవరికి సీటు కేటాయించాలనేది కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది.

-Politics

ఎందుకంటే ఈ ఇద్దరు నేతలు ఆర్థిక,  అంగ బలం ఉన్నవారే కావడం తో , ఈ సీటు విషయంలో వారినే తేల్చుకోవాల్సిందిగా అధిష్టానం సూచించడంతో , ఇద్దరు నేతలు భేటీలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో చర్చించుకున్నారు.ఇద్దరూ పాలేరు టికెట్లు ఆశించినా,  ఖమ్మం అసెంబ్లీ బరిలో మాత్రం తుమ్మల నాగేశ్వరావు ఉండబోతున్నట్లు సమాచారం.ఇద్దరి నేతల మధ్య జరిగిన చర్చల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు తుమ్మల అంగీకారం తెలిపారు .దీనికి కారణం తుమ్మల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఖమ్మంలో కీలకం కావడం, ఖమ్మంలో మంచి పట్టు ఉండడం,  భారీగా అనుచరగణం ఇవన్నీ లెక్కలు వేసుకోవడంతో పాటు,  సర్వే నివేదికల ప్రకారం పాలేరు కంటే ఖమ్మంలో తుమ్మలకు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో,  ఖమ్మం నుంచి పోటీ చేసినందుకు తుమ్మల అంగీకారం తెలిపారట .

-Politics

ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.పాలేరు , కొత్తగూడెం ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు పొంగులేటి( Ponguleti srinivasareddy, ) సిద్ధంగానే ఉన్నారట.దీని పై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలని,  ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని  అధిష్టానానికి తేల్చి చెప్పారట.

ఇక వాప పక్ష పార్టీలతో జాతీయ స్థాయిలో పొత్తు కుదిరిన నేపథ్యంలో తెలంగాణలో సిపిఐ కి రెండు , సిపిఎం కు రెండు స్థానాలను ఆ రెండు పార్టీల నేతలు ఆశిస్తున్నారు.పాలేరు భద్రాచలంపై సిపిఎం ఆశలు పెట్టుకోగా , కొత్తగూడెం,  మునుగోడు సీట్లను సిపిఐ ఆశిస్తుంది .దీంతో  వామపక్ష పార్టీలకు సీట్లను సర్దుబాటు చేసిన తరువాతే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube