టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) హీరోగా నటించిన తాజా చిత్రం క.( Ka Movie ) తాజాగా దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
విడుదలైన మొదటి షోకే పాజిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.కిరణ్ అబ్బవరం ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేశాడు.
ఇన్నేళ్లు కిరణ్ అబ్బవరం డీసెంట్ మూవీ తీసినా ఎవ్వరూ హిట్టుగా పరిగణించే వాళ్లు కాదు.దీంతో అందరికీ సమాధానం చెప్పేలా అందరూ ఒప్పుకునేలా ఒక సాలిడ్ హిట్టు కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

అందుకే కాస్త గ్యాప్ తీసుకుని అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చాడు.అయితే ఇప్పుడు రొటీన్ చిత్రాల కంటే కంటెంట్ ఉన్న చిత్రాలనే ఆడియెన్స్ ఆదరిస్తున్న సంగతి తెలిసిందే.క చిత్రానికి మంచి లాంగ్ వీకెండ్ వచ్చింది.టాక్ బాగా రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.ఇలా మూడు రోజుల్లోనే ఈ చిత్రం 20 కోట్ల గ్రాస్ వరకు రాబట్టింది.అసలు పది కోట్ల షేర్ టార్గెట్ తోనే థియేటర్లకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఆదివారం లెక్కల్ని కూడా కలిపితే ఈ చిత్రం దాదాపుగా 26 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది.అంటే దగ్గరదగ్గరగా 13 కోట్ల షేర్ ఈ వీకెండ్ లోనే వచ్చేసింది.
అలా చూస్తే ఇప్పటికే క మూవీ లాభాల్లోకి వచ్చేసింది.

ఆ ప్రకారంగా చూసుకుంటే వీకెండ్‌కే క మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టేసి, లాభాల్లోకి వచ్చేసినట్టే అని చెప్పాలి.ఇక ఓవర్సీస్ లో అయితే క మూవీ రేర్ ఫీట్‌ను సాధించేలా ఉంది.ఇంత వరకు కిరణ్ అబ్బవరంకు హాఫ్ మిలియన్, మిలియన్ డాలర్ కొట్టిన చిత్రం లేదు.
మొదటి సారిగా క చిత్రం హాఫ్ మిలియన్ డాలర్‌కు కొట్టి కిరణ్ మార్కెట్‌ను పెంచేసింది.మున్ముందు ఈ చిత్రం మిలియన్ డాలర్ మార్క్‌ని కూడా టచ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.
ఒక వేళ మిలియన్ మార్క్‌ను టచ్ చేస్తే మాత్రం ఎంతో మంది మిడ్, స్టార్ రేంజ్ హీరోల కంటే కిరణ్ అబ్బవరం గ్రేట్ అన్నట్టుగా అయిపోతుంది.







