యూట్యూబ్‌లో చూసి పేషెంట్‌కి ఆ పని చేసిన ఆసుపత్రి సహాయక సిబ్బంది(వీడియో)

ప్రస్తుత రోజులలో చాలామంది ఎవరికైనా ఏదైనా పని రాకపోయినా, ఏదైనా కొత్త వాటి గురించి తెలుసుకోవాలన్నా కానీ.చాలామంది చేసే పని యూట్యూబ్ లో (you tube)శోధించి తెలుసు కోవడం.

 Hospital Support Staff Who Did This To A Patient After Watching It On Youtube (-TeluguStop.com

ముఖ్యంగా యూట్యూబ్ ను సంప్రదిస్తూ అందుకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉంటారు.అయితే, అచ్చం అలాగే తాజాగా ఒక ల్యాబ్ అటెండెంట్ చేసిన నిర్వాహనికి నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ దీపావళి పండుగ (Diwali festival)సందర్భంగా లీవ్ లో ఉన్నందున ల్యాబ్ అటెండెంట్ చేసిన నిర్వహం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి కలుగచేస్తుంది.

యూట్యూబ్లో వీడియో చూసి మరి పేషెంట్ కు ఈసీజీ టెస్ట్ చేయడంతో పేషేంట్ తో పాటు అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు.

అటెండెంట్ చేసిన ఈ నిర్వహణ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పేషంట్ బంధువులు.ఈ విచిత్ర సంఘటన రాజస్థాన్‌ లోని జోధ్‌పూర్‌ జిల్లాలోని(Jodhpur district , Rajasthan) పావ్టా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

సరైన అవగాహన లేకుండా ఇలా ఈసీజీ స్కానింగ్ చేస్తే ప్రాణాలకే ముప్పు రావచ్చు కదా అని రోగి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడంతో.సంఘటనపై అటెండర్ కూడా కూడా స్పందించాడు.

హాస్పిటల్ సిబ్బంది ఎవరూ లేరని వివరిస్తూ.అన్ని సరిగ్గానే ఉన్నాయని యంత్రం ఏం చేయాలో అదే చేస్తుందని రోగు బంధువులకు సమాధానం ఇచ్చాడు.ఇక ఈ వీడియో పై మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ బీఎస్ జోధా స్పందిస్తూ(BS Jodha responded).ఈ సంఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది అటెండెంట్ టాలెంట్ గురించి రాసుకొని వస్తుంటే.

మరి కొందరు హాస్పిటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube