టెక్సాస్‌ : చరిత్రలో నిలిచిపోయేలా దీపావళి వేడుకలు .. తొలిసారిగా బాణాసంచాకు అనుమతి

దివ్వెల పండుగ దీపావళిని( Diwali ) భారత్ సహా పలు దేశాలలో ఘనంగా జరుపుకున్నారు.భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన అమెరికాలో( America ) దివాళీ ఘనంగా జరిగింది.

 Texas Governor Greg Abbott Celebrate Diwali At Their Residence In Austin Details-TeluguStop.com

న్యూయార్క్ నగరంలో ఈ ఏడాది నుంచి స్కూళ్లకు సెలవు ప్రకటించారు.వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) హాజరయ్యారు.దాదాపు 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.

Telugu America, Austin, Diwali, Diwali Festival, Kamala Harris, Joe Biden, Texas

ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ .అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు భారీగా దీపావళి వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు.కమలా హారిస్( Kamala Harris ) నుంచి డాక్టర్ వివేక్ మూర్తి వరకు మీలో చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని బైడెన్ పేర్కొన్నారు.

Telugu America, Austin, Diwali, Diwali Festival, Kamala Harris, Joe Biden, Texas

టెక్సాస్ రాష్ట్రం( Texas State ) అధికారికంగా గుర్తించడం హ్యూస్టన్, హారిస్ కౌంటీ, హ్యూస్టి సిటీ హాల్‌లో బాణాసంచా కాల్చుకోవడానికి తొలిసారిగా అనుమతి రావడంతో ఈ ఏడాది అక్కడి దీపావళి వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయి.కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీ మంజునాథ్( CGI DC Manjunath ) ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలు ఆకట్టుకున్నాయి.ఆస్టిన్‌లోని గవర్నర్ మాన్షన్‌లో దీపావళిని జరుపుకునే సాంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగింది.టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్( Texas Governor Greg Abbott ) స్వయంగా జ్యోతి వెలిగించి వేడుకల్లో పాల్గొన్నారు.

టెక్సాస్ – ఇండో అమెరికన్ కమ్యూనిటీ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కాన్సుల్ జనరల్ మంజునాథ్ చేస్తున్న కృషికి గవర్నర్ అబాట్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక అక్టోబర్ 31 మధ్యాహ్నం హ్యూస్టన్ సిటీ హాల్‌లో మేయర్ కార్యాలయం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు జరిగాయి.

మేయర్ జాన్ విట్‌మైర్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ అతిథులకు స్వాగతం పలికారు.భారతీయులు గొప్పగా భావించే భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక విలువలను పాటించినందుకు గాను హ్యూస్టన్ ప్రజలకు , మేయర్ విట్‌మైర్‌కు కాన్సుల్ జనరల్ మంజునాథ్ ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube